మాల్ రాణిఖేత్ లో ఒక ప్రముఖ షాపింగ్ ప్రాంతం. యాత్రికులు ఇక్కడి మార్కెట్ నుండి అందమైన ట్వీడ్ శాలువాలు, ఉన్ని చొక్కాలు, కుర్తాలు మరియు జాకెట్లు కొనుగోలు చేయవచ్చు. మార్కెట్ నాణ్యమైన నూలు,ఉన్ని బట్టలకి ప్రసిద్ధి చెందింది. చేనేత వస్త్రాలు ఇక్కడ సహేతుకమైన ధరలలో అందుబాటులో ఉన్నాయి. ఇది స్థానికులకు మరియు పర్యాటకులకు ఒక ప్రముఖ సమావేశ ప్రదేశం. సదర్ బజార్ యొక్క కోలాహలంతో పోల్చితే, మాల్ షాపింగ్ ఆస్వాదించడానికి మెరుగైన ప్రాంతం.