గోవింద్గర్ లేక్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సరస్సులలో ఒకటి. గోవింద్గర్ రాజభవనము ఈ సరస్సు ఒడ్డు వెంట నిర్మించుట వల్ల రాజభవనం అందమైనదిగా కనిపిస్తుంది. ఈ సరస్సు చుట్టూ సుందరమైన ప్యాలెస్ ఉండుట వల్ల ఆ ప్రాంతంలో ఖచ్చితమైన శాంతి మరియు సహజమైన అందంను చూడవచ్చు.
ఈ సరస్సు రేవా ప్రధాన నగరం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ సరస్సును మొదటిసారి సందర్శించినప్పుడు దాని అత్యద్భుతమైన అందాన్ని మళ్ళీ మళ్లీ చూడాలని అనిపించే ఒక పూర్తి సౌందర్య అభిప్రాయాన్ని పర్యాటకులకు అందిస్తుంది.
పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా సరస్సులో అనేక దీవులను ఏర్పాటు చేసారు. ఈ ప్రదేశం పక్షులను తిలకించాలనుకునేవారికి ఒక భూతల స్వర్గంలా భావించబడుతుంది. ఏడాది పొడవునా పర్యాటకులు వందల సంఖ్యలో ఈ స్థలాన్ని సందర్శిస్తుంటారు. ఈ సరస్సుకు సంవత్సరం పొడుగునా భిన్న రకాల పక్షులు వస్తాయి. వాటికీ ఈ సరస్సు సముచిత స్థానాన్ని కల్పిస్తుంది.