పాణజిం చుట్టుపక్కల ప్రదేశాలనే ఇల్లాస్ జిల్లాగా చెపుతారు. దీనినే ఇపుడు రిబాండర్ అంటున్నారు. ఈ పేరు ఓడరేవులకు రారాజు అయిన బందర్ నుండి ఏర్పడింది. రిబందర్ ఏ రాజు నిర్మించాడనేది ఇంకా తెలియదు కాని, ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే ఎంతో చరిత్ర కలదు.
అనేక చక్కటి చర్చిలు మరియు ఆసియాలోనే మొదటి హాస్పిటల్ మరియు గోవా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ వంటివి కలవు. సాయంకాల సమయంలో అక్కడ కల వంతెనలపై నుండి రిబాందర్ దర్శిస్తే, పచ్చటి ప్రదేశంగా కనపడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. వాణిజ్య పర చర్యలకు దూరంగా ఉంటుంది. రిబందర్ గోవాలోని ప్రఖ్యాత ఫాదర్ ఆంటోనియో ఫ్రాన్సిస్కో జావియర్ అల్వారేస్ కు కూడా అనుబంధం కలిగి ఉంది. ఈ ఫాదర్ ను సెయింట్ మేరీ ఆర్తోడాక్స్ సిరియన్ చర్చిలో సమాధి చేశారు. రిబాండర్ మండోవి నది ఒడ్డున కలదు. దీనిని చేరటం చాలా తేలిక. కావలసినన్ని వంతెనలు ఈ టవున్ షిప్ ను గోవాకు కలుపుతాయి. ఒక క్యాబ్ అద్దెకు తీసుకుని చేరిపోవచ్చు. పరిసరాలను ఆనందించాలన్నా, తాజాగాలి అనుభవించాలన్నా లేదా ఇక్కడకల దేవాలయాలు, చర్చిలు చూడాలన్నా ఒక బైక్ అద్దెకు తీసుకొని స్వంతంగా చూసి ఆనందించండి.