ఖోకర్ లేదా ఖోఖల్ గా కూడా పిలిచే ఖోకర్లు జాట్ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. హర్యానాలోని జాట్ లలోనే కాక వీరు పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో కూడా కనబడతారు.
ఆసక్తికరంగా వీరు ముస్లిములలో కూడా కనబడతారు. భారతదేశం, పాకిస్థాన్ లో హిందూ, ముస్లిం సమాజాలలో కనబడే బక్షీలు, మాలీకులు, జునేజాలు, కక్కర్లు, పండిట్ల లానే ఇది కూడానూ. ఇలాగే ఖోకర్లు పాకిస్థాన్ తో బాటు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా కనబడతారు. పాకిస్థాన్ లో భాగమైన బలోచిస్తాన్ ప్రాంతంలోని బలోచులలో ఖోకర్ వంశానికి చెందిన జాట్లు ఉంటారు.
నాగవంశ కర్కోటక ఖోకర్ జాట్ సమాజానికి మూలమని విశ్వసిస్తారు. రాయ – మథుర, సింధు ప్రాంతాలను కూడా ఖోకర్లు పాలించారు. సిక్కుల గురువు హర గోవింద్ జీకి అత్యంత విశ్వాసం గల శిష్యుడు భాయి రూప్ చంద్, కూడా ఒక ఖోకరే.
హర్యానాలోని రోహటక్ జిల్లాలో ఖోకర్ కోటను ఖోకర్లు నిర్మించారు. అప్పట్లో వైభవం, బలోపేతమైన ఈ కోట దురదృష్టవశాత్తూ ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది.