దేహ్రి సోనే నది ఒడ్డున కలదు. సుమారు 99 మీ.ల ఎత్తులో వుంది ప్రదేశం ఆహ్లాదంగా వుంటుంది. ఇక్కడ బ్రిటిష్ సైనికులు తాము కోల్కతా నుండి ఢిల్లీ వెళ్ళేటపుడు తప్పక బస చేసి ఆనందించేవారు.
దేహ్రి అంటే టవున్ అని అర్ధం చెపుతారు. ఈ టవున్లో కల బొగ్గు డిపో ఉత్తర ప్రాంతం లోని అనేక మందికి వినియోగపడుతుంది. ఈ ప్రదేశం లోని ప్రఖ్యాత బెంగాలి నవలా రచయిత శరత్ చంద్ర చట్తో పాధ్య అనేక ఏళ్ళు గడిపాడు. ఈయన గృహ దాహ అనే నవల రాసి ఖ్యాతి గాంచాడు. బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతంలో పాశ్చాత్య విద్యను వ్యాప్తి చేయటానికి గాను దేహ్రి పబ్లిక్ స్కూల్ స్థాపించారు.