స్వచ్ఛమైన మేహవో సరస్సులోని నీరు మేహవో వన్యప్రాణి అభయారణ్యంలో ఒక భాగమే కాక, ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ ప్రశాంతమైన సరస్సు చుట్టూ ప్రాకృతిక సౌందర్యం ఉంది. దీనిలో తక్కువ పోషక విలువలు ఉన్నందున, ఈ సరస్సులో చేపలు లేవు. ఇది సముద్రమట్టానికి సుమారు 300 అడుగుల ఎత్తున ఉంది. ఈ ప్రాంతం విభిన్న వృక్ష, జంతు సంపదతో నిండి ఉంది. పెద్ద సంఖ్యలో బాతులను సందర్శకులు చూడవచ్చు. ఈ ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పక్షులను చూసే వారికి ఈ ప్రాంతం ఆనందాన్ని కల్గిస్తుంది. ఇది 4 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. ఈ ప్రాంతానికి దారి తీసే మార్గాన్ని అధిరోహించవచ్చు.