బిజూ పట్నాయిక్ హాకీ స్టేడియం సెక్టార్ 5 మరియు సెక్టార్ 6 మధ్య ఉంది. స్టేడియం క్రీడాకారులకు ప్రయోజనకరంగా ఆధునిక సాంకేతికత సహాయంతో తయారు చెయ్యబడింది. ఇది దేశంలో అత్యుత్తమ హాకీ స్టేడియంలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పెద్ద స్టేడియంలో సౌకర్యవంతమైన పద్ధతిలో వేల కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. ఈ స్టేడియం రూర్కెలా స్టీల్ ప్లాంట్ SAIL ద్వారా నిర్మించబడింది.
స్టేడియంలో ఆటగాళ్ళు ఉండడానికి మరియు సాధన చేసేందుకు ఆటగాళ్ల హాస్టల్ ఉంది. రూర్కెలా స్టీల్ ప్లాంట్ అథారిటీ హాకీ రంగంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. మొత్తం స్టేడియం ఒక క్రమ పద్ధతిలో తయారు చేయబడింది. పర్యాటకులు మరియు క్రీడా ఔత్సాహికులు రూర్కెలా కు వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పక సందర్సించాలి.