Search
  • Follow NativePlanet
Share

శబరిమల దివ్యక్షేత్రం - స్వామియే శరణం అయ్యప్పా....!

17

చుట్టూ దట్టమైన అడవులతో ఉన్న ప్రఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రం శబరిమల. సహజసిద్దమైన ప్రకృతి ఒడిలో ,పంబా నది ఒడ్డున , పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలో ఉన్నది ఈ పుణ్యక్షేత్రం.లక్షలాది భక్త జనం మలయాళ క్యాలెండర్ ప్రకారం మండలకల కాలం అయిన నవంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ క్షేత్రానికి తరలి రావటం జరుగుతుంది. భారతదేశ నలుమూలల నుండి భక్తులు తమ తమ మతాలకు అతీతంగా, మరియు ఆర్ధిక స్తితిగతులకు అతీతంగా ఈ క్షేత్రానికి ప్రతిసంవత్సరం వస్తారు.

పురాణ విశేషం

సబరిమల్ అంటే శబరి( రామాయణ గాథ లోని ఓక పుణ్య పాత్ర ) యొక్క పర్వత శ్రేణి అని అర్ధం.కేరళ లోని మానవీయ పెరియర్ టైగర్ హిల్ రిజర్వు లో ఉన్నటువంటి , పట్టనంతిట్ట జిల్లా కి తూర్పు ప్రాంతాన ఉన్నదీ గొప్ప క్షేత్రం.ఈ దేవాలయం లో కొలువున్న దేవుడు అయ్యప్ప లేదా స్వామీ అయ్యప్ప. ఈ స్వామి దర్శనం కోసం ఇక్కడకి రావాలనుకొనే భక్తులు తప్పనిసరిగా 41 రోజులు శాఖాహారులై లౌకిక సుఖాలకు దూరం గా ఉండాలి.

ఇక్కడి దేవాలయానికి ఉండే పచ్చని చెట్లు,ప్రవాహాలు మరియు పచ్చిక బయళ్ళ లో నుండి ఉండే కాలిబాట లో ప్రయాణం ప్రతిఒక్కరికి భగవత్ ప్రేరేపిత అనుభవం గా ప్రతి ఒక్కరు తమ జీవిత కాలం లో చవి చూడ వలసిన ఒక అద్భుతం.

భగవంతుని చేరే మార్గం (తనను తానూ తెలుసుకోవటమే)

కాలినడకన దేవాలయం చేరే భక్తులు ఈ పొడవైన, కఠినమైన మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే చెట్ల నీడలో విశ్రమించి సేదతీరి ప్రయాణం కొనసాగించవచ్చు. ప్రపంచం లోనే అతి గొప్ప పుణ్యక్షేత్రం గా పేరు గడించిన ఈ శబరిమల కు ప్రతి సంవత్సరం సుమారు 45-50 మిలియన్ ల భక్తులు విచ్చేస్తారు.18 కొండల మధ్య ఉన్న ఈ అయ్యప్ప స్వామి కోవెల చూడటానికి ఏంతో కన్నుల పండుగగా ఉంటుంది.ఈ దేవాలయం పర్వత శ్రేణుల మధ్య, దట్టమైన అడవుల మధ్య శిఖరం పైన సముద్ర మట్టానికి 1535 అడుగుల ఎత్తున ఉన్నది.

శబరిమల యొక్క ఔన్నత్త్యం

భయంకరమైన రాక్షసి మహిషి ని అంతమొందించి అయ్యప్పస్వామి ఇక్కడ తపస్సు చేసారని పురాణాలు చెపుతాయి. శబరిమల దేవాలయం చాలామంది భక్తులకు సమానతకు ,సమైక్యతకు,మంచికి చిహ్నం గా గోచరిస్తుంది. ఇది భక్త జనానికి మరొకసారి మంచి ఎప్పుడు చెడుని జయిస్తుంది అని , ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది.మతాతీతంగా, కులాతీతంగా, వర్ణాతీతం గా భక్తులకు అందుబాటు లో ఉన్న అతి కొద్ది దేవాలయాలలో శబరిమల పుణ్య క్షేత్రం ఒకటి.మహావిష్ణువు యొక్క ఒకానొక అవతారమైన పరశురామ మహర్షి తన గొడ్డలిని పారవేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమల లో ప్రతిష్టించారని చెప్పబడుతుంది. ఈ శబరిమల ప్రభుత్వ ఆధ్వర్యం లోని ద త్రావెంకరే దేవస్వోం బోర్డు (TDB) యొక్క నిర్వహణ లో ఉన్నది.

పుణ్యక్షేత్రం

శబరిమల దీక్షా కాలం నవంబర్ మధ్యలో ప్రారంభమై జనవరి నాలుగవ వారంలో ముగుస్తుంది. జనావాసాలు లేకపోయినా శబరిమల పట్టణ సముదాయం నిరంతరం యాత్రికులు, దుకాణాలు మరియు హోటల్స్ తో ఎప్పుడూ రద్దీ గా నే ఉంటుంది. శబరిమల లో ప్రధానంగా జరుపుకునే పండుగలు మండల పూజ మరియు మకరవిలక్కు. వవారు స్వామి అనబడే ముస్లిం పకిరుకి ఇక్కడ మందిరం ఉంది. అందువల్ల, ఈ ప్రాంతం మతాలకు అతీతంగా ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుంది.

ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం కలగలిపిన ఈ శబరిమల సందర్శన అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.వేల మంది పర్యాటకులు భక్తితో ఈ శబరిమలను సందర్శించేందుకు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఇక్కడికి తరలి వస్తారు. పచ్చని చెట్లు, అందమైన ప్రవాహాలని దాటుకుంటూ చక్కటి నడక ద్వారా ఈ అయ్యప్పస్వామి గుడికి చేరుకోవడం వర్ణనాతీతమైన అనుభూతి.

ఈ కొండ పైకి ఎక్కడానికి సుమారు మూడు కిలో మీటర్లు కాలి నడకన వెళ్ళాల్సి వస్తుంది. వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలం, అద్భుతమైన పర్వత సౌందర్యం దారి పొడవునా కనువిందు చేస్తాయి. ప్రకృతి ని ఆరాధించేవారికి ఈ శబరిమల సందర్శనం మధురానుభూతిని కలిగిస్తుంది. ప్రధాన నగరాలకు రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా అనుసందానమైన పంబా పట్టణం నుండి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. శబరిమల ను సందర్శించదలచిన పర్యాటకులకు అన్ని సిజన్లలో టూరిస్ట్ ప్యాకేజులు మరియు హోటల్ వసతులు అందుబాటు ధరలోనే ఉంటాయి.

శబరిమల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శబరిమల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శబరిమల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శబరిమల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : కేరళ లో ఉన్న అన్ని ప్రధాన నగరాల నుండి పంబ పట్టణానికి తరచూ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) ద్వారా కేరళ ప్రభుత్వ రవాణా శాఖ కొట్టాయం, చెంగన్నూర్ మరియు తిరువల్ల రైల్వే స్టేషన్ ల కి బస్సు సర్వీసులు నడుపుతుంది. ప్రైవేటు టాక్సీలు మరియు టూరిస్ట్ ప్యాకేజీ లు కూడా శబరిమల కి అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : పంబా పట్టణానికి 90 కి మీ ల దూరం లో ఉన్న చెంగన్నూర్ రైల్వే స్టేషన్, శబరిమల కి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. తిరువనంతపురానికి మరియు కొట్టాయం కి మార్గమధ్యంలో ఈ చెంగన్నూర్ ప్రాంతం ఉండడం వల్ల భారత దేశంలో ప్రముఖమైన రైల్వే స్టేషన్స్ అన్నిటికి అనుసంధానించబడి ఉన్నది. చెంగన్నూర్ నుండి పంబా పట్టణానికి టాక్సీ సేవలు అందుబాటులోఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం శబరిమలకి సమీపంలో ఉన్నాయి. శబరిమల నుండి తిరువనంతపురం 130 కి మీ ల దూరంలో, కొచ్చి నేడంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం 190 కి మీ ల దూరంలో ఉన్నాయి. ఈ రెండు విమానాశ్రయాల నుండి పంబా పట్టణానికి టాక్సీ సేవలు లభ్యమవుతాయి. పంబా పట్టణం నుండి సులభంగా శబరిమలకు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat