సాగరేశ్వర వన్య జంతు సంరక్షణాలయం పర్యాటకులకు సంగ్లీ సమీపంలో పెద్ద ఆకర్షణ. వన్య జంతు ప్రియులు ఇక్కడ ఎన్నో రకాల జంతువులను, మొక్కలను చూడవచ్చు. సంగ్లీకి 30 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ శాంక్చురీ అడవుల అభివృధ్ధిలో భాగంలో ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది. సుమారుగా 10.87 చ. కి.మీ.ల విస్తీర్ణంలో కల ఈ ప్రదేశం ఎన్నో జంతువులు ...చిరుతలు, జింకలు, అడవి పక్షులు, కుందేళ్ళు, నెమళ్ళు వంటివి కలిగి ఉంటుంది. రకరకాల కీటకాలు మరియు సరీనృపాలు కూడా చూడవచ్చు. సంగమేశ్వర దేవాలయం దీనికి సమీపంలోనే కలదు.