Search
  • Follow NativePlanet
Share

సరహన్ - మంచు చే కప్పబడిన ప్రదేశం !

17

హిమాచల్ ప్రదేశ్ లో ని షిమ్లా జిల్లలో ఉన్న సుట్లేజ్ వాలీ లో నెలకొని ఉన్న చిన్న కుగ్రామం సరహన్. సముద్ర మట్టం నుండి 2165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం ఆపిల్ చెట్ల తోటలు, పైన్ తోటలు, చిన్న ప్రవాహాలు, రాస్టిక్ సెట్టింగులు అలాగే పెంకుటిళ్ళకి ప్రసిద్ది. ప్రకృతి ఒడిలో సేద దీరాలనుకునే పర్యాటకులకు ఈ ప్రాంతం అనువైనది. ఈ సరహన్ గ్రామం గురించి ఎన్నో పురాణ గాధలు ఉన్నాయి. కులూ రాజు పక్క రాజ్యం బుశైర్ మీద యుద్ధం ప్రకటించాడు. బుశైర్ రాజ్యపు రాజు గెలిచి కులూ రాజు ని శిరచ్చేదం చేశాడు. చనిపోయిన కులూ రాజు యొక్క శిరస్సు ని సరహన్ కి ప్రజల సందర్శనార్ధం ఉంచాడు.

కులూ రాజు కుటుంబీకులు అంతిమ కర్మలు ఆచరించడానికి బుశైర్ రాజుని కులూ రాజు శిరస్సు ని కోరగా అతను మూడు షరతులను వారి ముందుంచుతాడు. ఒకటి, కులూ ప్రజలు ఎప్పుడూ తన పాలనని ప్రశ్నించరాదని, రెండు స్వాధీనం చేసుకోబడిన ఈ రాజ్యం తన అధీనం లో నే ఉంటుందని. మూడు, సరహన్ ప్రాంతపు దైవం అయిన రఘునాథ్ ప్రతిమ తిరిగి ఇవ్వబడదని తెలుపుతాడు. ఈ మూడు షరతులను బుశైర్ రాజు దసరా పండుగని క్రమం తప్పకుండా జరుపుకుంటాడన్న మాటని తిరిగి పుచ్చుకున్నాక ఒప్పుకున్నారు.

అందువల్ల ఈ ప్రాంతం లో జరిగే గొప్ప వేడుకగా దశరా పేరొందింది. ఆ తరువాత భీమకాళి దేవత పక్కనే రఘునాథుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. భీమకాళి టెంపుల్ కాంప్లెక్స్, ది బర్డ్ పార్క్ మరియు బాబా వాలీ వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణ ప్రదేశాలు సరహన్ ప్రాంతం లో కలవు. భీమ కాళీ టెంపుల్ కాంప్లెక్స్ 800 సంవత్సరాల క్రితానికి సంబంధించినదని నమ్ముతారు. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. భారతీయ మరియు బౌద్ధుల నిర్మాణ శైలి ని ఈ ఆలయం ప్రతిబింబిస్తుంది. దేశం లో నే 'శక్తి పీఠ్' ల లో ఒకటి గా అలాగే పుణ్యక్షేత్రం గా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. రిజర్వాయర్ సరస్సులతో అలాగే ఆల్పైన్ మెడోస్ లతో ఆకట్టుకునే ప్రకృతి దృశ్యాలు ఈ ప్రాంతం సొంతం. సహారన్ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం బర్డ్ పార్క్.

ఇది నెమళ్ళ సంతానోత్పత్తి కేంద్రమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి అయిన మోనాల్ కి స్థావరం కూడా. దట్టమైన పచ్చని డియోడార్ చెట్లు, మంచుతో కప్పబడిన బశల్ పర్వతాల కి ఈ ప్రాంతం ప్రసిద్ది. సముద్ర మట్టం నుండి 5155 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీఖండ్ మహాదేవ కి సరహన్ ప్రసిద్ది. మహాశివుడి కి ఈ హిందూ పుణ్యక్షేత్రం అంకితమివ్వబడినది. శివుడు ఈ ప్రాంతం లో నే తపస్సుచేసాడని హిందూ పురాణాలూ చెబుతున్నాయి. గొప్ప భారతీయ ఇతిహాసమైన 'మహాభారతం' , పాండవులు శిఖరానికి వచ్చారని చెబుతోంది. సందర్సకులకి ఈ పర్వతం అధ్బుతమైన ట్రెక్కింగ్ అవకాశాలను కలిగిస్తుంది.

బంజారా రిట్రీట్, గౌరా, దరంగ్ ఘటి మరియు సంగ్లా వాలీ లు ఈ సరహన్ ప్రాంతం లో ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు. సరహన్ నుండి 20 కిలో మీటర్ల దూరం లో ఉన్న జియోరి లో వేడి నీటి కొలను ఉంది.సరహన్ నుండి 22 కిలోమీటర్ల దూరం లో ఉన్న బంజారా ఆకుపచ్చని ఆపిల్ తోటలకి ప్రసిద్ది. సరహన్ కి సమీపం లో ఉన్న సంగ్లా వాలీ ఆపిల్ మరియు చెర్రీ తోటలకి అలాగే గ్లేసియల్ స్ట్రీమ్స్ కి ప్రసిద్ది. రోడ్డుమార్గం, వాయు మార్గం లేదా రైలు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా సరహన్ కి చేరుకోవచ్చు. ఏప్రిల్ నుండి నవెంబర్ నెలల లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. శీతాకాలం లో కూడా ఈ ప్రాంత వాతావరణం ఆహ్లాదకరం గా ఉండడం వల్ల పర్యాటకులు ఈ సమయాన్ని కూడా సందర్శనకి పరిగణలోకి తీసుకోవచ్చు.

సరహన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సరహన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సరహన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సరహన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : సరహన్ ని సందర్శించాలనుకునే పర్యాటకులు రోడ్డు మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఢిల్లీ మరియు షిమ్లా ల కి రెగ్యులర్ బస్సు సేవలు అందుబాటులో కలవు. మనిషి కి 700 రూపాయలు ఛార్జ్ చేసే విలాసవంతమైన ఏ సి వోల్వో బస్సులు ఢిల్లీ నుండి సరహన్ కి కలవు. ఏ సి బస్సులు షిమ్లా నుండి సరహన్ కి చేర్చడానికి మనిషికి 275 రూపాయలు ఛార్జ్ చేస్తాయి. పొరుగు పట్టణాల నుండి హిమాచల్ ప్రదేశ్ కు హిమాచల్ ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (HTDC) బస్సులు అందుబాటులో కలవు. టాక్సీ లు మరియు జీపులు ద్వారా కూడా షిమ్లా, చండి గర్హ్ మరియు ఢిల్లీ ల నుండి ఈ ప్రాంతానికి సందర్శకులు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : సరహన్ కి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ కల్కా రైల్వే స్టేషన్. షిమ్లా రైల్వే స్టేషన్ నుండి సుమారు 84 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన భారతీయ పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది. సరహన్ కి చేరుకోవడానికి ఈ రైల్వే స్టేషన్ వెలుపల క్యాబ్ మరియు టాక్సీ సేవలు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ప్రధాన రవాణా పద్దతులైన వాయు మార్గం, రైలు మార్గం మరియు రోడ్డు మార్గాలని ఉపయోగించి సరహన్ కి సులభంగా చేరుకోవచ్చు. వాయు మార్గం : సరహన్ నుండి 175 కిలో మీటర్ల దూరం లో ఉన్న జుబ్బర్హట్టి విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. కులూ, షిమ్లా, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన పట్టణాలకి ఈ విమానాశ్రయం రెగ్యులర్ విమానాల ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఈ విమానాశ్రయ వెలుపల 2000 రూపాయల ధరలో టాక్సీ మరియు క్యాబ్ సదుపాయాలు సరహన్ కి కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed