Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సతారా » వాతావరణం

సతారా వాతావరణం

సందర్శనకు అనుకూల సమయంకొండల మధ్య వుండడం వల్ల సతారలో చాలా హాయి గొల్పే వాతావరణం వుంటుంది. ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం వుండే ఈ ప్రదేశం వేడిగా, పొడిగా వుంటుంది. శీతాకాలంలో ఆహ్లాదపరిచే పరిసరాలు ఈ ప్రదేశం చూడ్డానికి అన్నిటికన్నా అనువైన కాలం.

వేసవి

సతారా – వాతావరణంవేసవిఇక్కడి వేసవి 27 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతతో చాలా వేడిగా వుంటుంది. మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు వుండే వేసవిలో పెరిగే ఎండల వల్ల స్థల సందర్శనకు అనుకూలంగా వుండదు.

వర్షాకాలం

వర్షాకాలంజూన్, జూలై, ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ మధ్య వరకు సతారాలో వర్షాకాలం నడుస్తుంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఈ కాలం వేసవి సెగలు తగ్గి ఈ ప్రాంతం అందాలు ఇనుమడిస్తాయి.  మీరు వర్షాన్ని ఇష్టపడే వారైతే ఈ సమయంలో ప్రయాణం సరదాగా వుంటుంది. అయితే సరైన రక్షణ సామగ్రి తీసుకువెళ్ళడం తప్పనిసరి.

చలికాలం

శీతాకాలంనవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలం సతారాను హాయిగా చూడ్డానికి అనువైన కాలం. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు తగ్గి, 31 డిగ్రీలవరకు వెళ్తాయి. ఉన్ని దుస్తులు వాడాల్సిందే.