సేనాపతి ప్రజల జీవనం తెలుసుకోవాలంటే అతి పురాతనమైన ఈ గ్రామం తప్పక చూడాలి. ఈ గ్రామం సేనాపతి టవున్ కు 18 కి. మీ. ల దూరం లో కలదు. సన్నని రోడ్డు పై ప్రయాణించాలి. చరిత్రకారులు మణిపూర్ చరిత్ర పరి శోధించేందుకు ఇక్కడకు వస్తారు.
ఈ గ్రామ ప్రజలు నేటికి తమ పురాతన సాంప్రదాయాలను పాటిస్తారు. నేటికి అనేక పురాణ గాధలను వినిపిస్తారు. విలేజ్ చీఫ్ ను ఒక రాజు గా గౌరవించి, అతని ఆదేశాలను పాటిస్తారు.