పురూల్ గ్రామం సేనాపతి నుండి కొద్ది దూరం లోనే వుంటుంది. ఒక మంచి పర్యాటక ఆకర్షణ. ఇక్కడ మీరు మణిపూర్ సాంప్రదాయాలను చూస్తారు. ఈ గ్రామం మార్గం పొడవునా ఎన్నో ప్రకృతి దృశ్యాలు చూసి జీవితం లో మరచి పోలేని అనుభూతులు పొందుతారు.
ఈ గ్రామం లోని తోటో మరియు రేజిలింగ్ ఆటలు పుట్టాయి. ఈ సాంప్రదాయక ఆటలు చూసేందుకు ఇక్కడకు దేశం నలుమూలల నుండి క్రీడాభిమానులు వస్తారు. తోటో ఆటను ఒక కొత్త సంవత్సరం పండుగ గా ను, మే నెలలో పంటలు చేతికి వచ్చిన సమయం లో రేజిలింగ్ నిర్వహిస్తారు. ఈ వేడుకలే కాక, మీరు, ఇక్కడి గ్రామీణ మహిళలు బట్టలు నేయుట, బట్టల నేత కు అవసరమైన పీచును అక్కడ పెరిగే చెట్ల నుండి సేకరించుట కూడా చూసి ఆనందిస్తారు.