అల్సిసార్, మల్సిసార్షేఖావతి ప్రాంతం లోని ఉత్తర ప్రాంతం చివర ఝుంఝును జిల్లాలో వున్న రెండు చిన్న పట్టణాలు అల్సిసార్, మల్సిసార్. 18వ శతాబ్దం మధ్యలోను, చివరిలోనూ వరుసగా ఈ రెండు పట్టణాలను స్థాపించారు. కుడ్య చిత్రాల అద్భుత శైలికి, రంగు రంగుల చిత్రాలకు ఈ రెండు పట్టణాలు ప్రసిద్ది చెందాయి.
బావులు, జలాశయాలతో బాటు అలంకృత రాజస్థానీ నిర్మాణం, రంగులద్దిన ప్రాసాదాలు ఈ ప్రాంతం లో చూడదగ్గ ప్రదేశాలు. ఝుంఝును పట్టణం నుంచి 27 కి.మీ దూరంలో వున్న అల్సిసార్ రంగులద్దిన కోటలకూ, ప్రాసాదాలకు ప్రసిద్ది. శ్రీ లాల్ బహదూర్ మల్ కీ హవేలీ, తేజ్ పాల్ ఝుంఝున్వాలా కీ హవేలీ, మహ్లీ దత్త్, ఖేతాన్ హవేలీ, ఠాకూర్ చోటూ సింగ్ సమాధి, శ్రీ లాల్ బహదూర్ మల్ బావి, జీవన్ రాం మరోడియా సరస్సు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు.ఝు౦ఝును పట్టణం నుంచి 32 కి.మీ దూరంలో వున్న చిన్న పట్టణం మల్సిసార్. ప్రేమ గిరి జీ కా మఠ్ (ఒక పవిత్ర ప్రదేశం), బనార్షీ దాస్ బంకా హవేలీ, షేర్ మల్ సరవోగి హవేలీ, బంకా బావి, జోఖీ రాం బావి, సరవోగి బావి ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు.