Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షిర్డి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా : పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచి షిర్డీ కి ప్రభుత్వ బస్సు సర్వీసులు అందుబాటులో వున్నాయి. మీరు ఎంచుకునే బస్సు సర్వీసుల ఆధారంగా చార్జీలు మనిషికి 200 రూపాయల నుంచి 400 రూపాయల దాకా వుండచ్చు. ముంబై, పూణే, నాశిక్ లాంటి నగరాల నుంచి ప్రైవేట్ లక్జరీ, డీలక్స్ బస్సుల్లో కూడా షిర్డీ చేరుకోవచ్చు. ముంబై నుంచి షిర్డీ కి రాష్ట్ర రవాణా సంస్థ, ప్రైవేట్ ఆపరేటర్లు ప్రత్యెక కోచ్ లు నడుపుతారు. నాశిక్, అహ్మద్ నగర, ఔరంగాబాద్, పూణే, కోపర్గావ్ ల నుంచి ప్రభుత్వ రవాణా సంస్థ నిత్యం బస్సులు తిప్పుతుంది. ముంబై నుంచి షిర్డీ కి టాక్సీలు కూడా వుంటాయి – చార్జీలు సుమారు 6000 రూపాయలు వుంటుంది. ముంబై నుంచి షిర్డీ కి రోడ్డు ద్వారా 241 కిలోమీటర్ల దూరం వుంటుంది, నాశిక్ నుంచి షిర్డీ కి 88 కిలోమీటర్లు, ఔరంగాబాద్ నుంచి 109 కిలోమీటర్లు, పూణే నుంచి 187 కిలోమీటర్ల దూరం వుంటుంది.