Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షిర్డి » వాతావరణం

షిర్డి వాతావరణం

దర్శించడానికి ఉత్తమ సమయం  :షిర్డీ లో వాతావరణం ప్రధానంగా పొడిగా వుంటుంది, ఏడాది పొడవునా భరించగలిగేలాంటి వాతావరణమే వుంటుంది. షిర్డీ దర్శించడానికి మాత్రం శీతాకాలం మంచి సమయం.

వేసవి

వేసవి :మార్చ్ నెల నుంచి మే దాకా వేసవి కాలం. గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 21  డిగ్రీలు వుండే ఈ కాలంలో సందర్శకులు తక్కువ గానే వస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం :ఈ యాత్రా స్థలంలో వాతావరణం సాధారణంగా పొడి గానే వుంటుంది. దాంతో వర్షాకాలం రాగానే హాయిగా అనిపిస్తుంది. జూన్ నుంచి ఆగష్టు దాకా కురిసే వర్షాలతో పరిసరాలన్నీ హరిత వర్ణంలోకి మారిపోతాయి. సాయిబాబా ను దర్శించడానికి ఆశ్రమాలు చూడ్డానికి ఇది మంచి సమయం.

చలికాలం

శీతాకాలం :శీతాకాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం గా 32  డిగ్రీలు, కనిష్టంగా 8  డిగ్రీలు వుంటాయి. షిర్డీ లో చలి కాలం చాలా చలిగా వుంటుంది – జనవరిలో ఉష్ణోగ్రత 7  డిగ్రీల దాకా పడిపోతుంది. ఎక్కువ మంది యాత్రికులు ఈ సమయంలో వస్తారు.