గావి గంగాధేశ్వర గుహాలయాన్ని బెంగుళూరు నగర స్ధాపకుడు కెంపే గౌడా నిర్మించారు. దీనిలో హిందువుల ఆరాధ్య దైవం శివ భగవానుడుంటాడు. ఈ దేవాలయంలోనే అరుదుగా కనపడే హిందూ దైవం అగ్ని దేవుడి విగ్రహం మరో 33 ఇతర విగ్రహాలతో కలసి ఉంటుంది. ఈ గుహ ఒకే రాతి తో సహజంగా ఏర్పడి దీనిలో అతి చక్కని వాస్తు కళ మరియు జ్యోతిష సిద్ధాంతం కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే హిందువుల పండుగ మకర సంక్రాంతికి సూర్యుడి కిరణాలు దేవాలయంలోకి అక్కడి శివుడి వాహనం అయిన నంది విగ్రహం కొమ్ముల ద్వారా ప్రవేశించి శివ భగవానుడి లింగాన్ని తాకుతాయి. భక్తులు ఈ సమయంలో అధిక సంఖ్యలో వచ్చి ఈ అసాధారణ సంఘటనను చూసి ఆనందిస్తారు. సందర్శకులు దేవాలయాన్ని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గం.లు మరియు సాయంత్రం 5 గం. నుండి 8.30 గంటల వరకు దర్శించుకోవచ్చు.