కాళీ సింధ్ నది కి తూర్పున ఉన్న ఈ కోట ప్రాచీన భారత దేశానికి ప్రతిబింబం వంటిది. శివపురి నుండి 42 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ కోట రాచరికపు సరిహద్దులని అలాగే భూభాగం విస్తరణ కోసం చేసే యుద్దాలని గుర్తుకు తెచ్చే అధ్బుతమైన ప్రాంతం. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరాన్ని 12 వ శతాబ్దం వరకు నలపుర గా పిలిచేవారు.
గొప్ప ఇతిహాసం అయిన మహాభారతం లో ని నలదమయంతి ల లో ఒక పాత్ర అయిన నలరాజా పేరుతొ ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. సముద్ర మట్టం నుండి 500 అడుగుల ఎత్తులో ఈ కోట ఉంది. 8 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన ఈ కోట ఘనమైన గతం గురించి అలాగే దృఢమైన రాజ్యం గురించి తెలుపుతుంది. కాలం ఇంకా ప్రకృతి ఈ కోట పై తమ ప్రతాపాన్ని చూపెట్టినా ఇప్పటికీ ఈ కోట అధ్బుతమైన నిర్మాణ శైలితో ఆకట్టుకుంటుంది.
ఈ కోట నిర్మాణం లో ఉన్న రాజ్పుట్ నిర్మాణ శైలి యొక్క ప్రభావం చదునైన పైకప్పులలో అలాగే స్థంభాలలో తెలుస్తుంది.