కరెంగ్ ఘర్ అహోం రాజుల పాలస్. ఇది శిబ సాగర్ కు 15 కి.మీ.ల దూరంలో గార్గావ్ అనే ప్రాంతం లో వుంటుంది. ఇది అహోం రాజులకు ప్రధాన ప్రదేశం గా వుండేది. కరెంగ్ ఘర్ ఏడు అంతస్తులు కలిగి వుంటుంది. అయితే మూడు అంతస్తులు భూమిలో వుంటాయి. వీటిని తలాతల్ ఘర్ అంటారు. భూమి పై వున్న వాటిని కరెంగ్ ఘర్ అంటారు. మొత్తం భవనాన్ని తలాతల్ పాలస్ అంటారు.
పై అంతస్తులు అంటే కరెంగ్ ఘర్ మూడు అంతస్తులు. వాటిలో ఒకట డోమ్ ఆకారం లో రూఫ్ కలిగి, ఒక ఛాంబర్ వుంటుంది. మొదట్లో దీనికి నాలుగు వాచ్ టవర్లు ఉండేవి. ఇపుడు రెండు మాత్రమే వున్నాయి. దీనిని చేరాలంటే రోడ్డు మార్గంలో 30 నిమిషాలు పడుతుంది.