వేల పుర అనే చిన్న గ్రామం షోలాపూర్ జిల్లా లో పంధర్ పుర నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామానికి ఈశాన్య దిక్కున చారిత్రికంగా ప్రాధాన్యత కల్గిన ఒక ముఖ్య దేవాలయం ఉంది. ఇది హేమండ్పతి వాస్తు శైలి లో నిర్మించబడి పురాతన అందానికి తార్కాణంగా కలదు.ఈ దేవాలయం నందు పుణ్యస్థలం ప్రక్కన 20 రాతి స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇంకొక ప్రదాన ఆకర్షణ అయిన హర నరేశ్వర ఆలయమనే దేవాలయం ఈ ప్రాంత పరిసరాల్లో ఉంది. ఈ ప్రాంతం నుండి శిలా శాసనాలు లిఖించబడిన మెట్ల శ్రేణి ఒక చతురస్రాకారపు చెరువునకు దారి తీస్తుంది.అంతేకాక ఈ గ్రామం శతాబ్దాల క్రితం ఇక్కడ నివసించిన ప్రజల సంస్కృతిని తెలయచేసే పురాతన కట్టడాలు నిర్మాణాలను కల్గి ఉంది.షోలాపూర్ రైలు స్టేషన్ లేదా షోలాపూర్ నగరం నుండి తిరిగే బస్సుల ద్వారా వేలపూర్ ను సులువుగా చేరవచ్చు.