బల్పక్రం, గారోల పవిత్ర భూమి. ఇది శాస్త్రం లేదా తర్కం ద్వారా వివరించలేని అనుమానాస్పద విషయంగా కనిపించే ఆత్మల నివాసంగా చెప్తారు. ఇక్కడ ప్రసిద్ధ బల్పక్రం నేషనల్ పార్క్ కూడా ఉంది.
బల్పక్రం నేషనల్ పార్క్, అంతరించిపోయే అడవి దున్నపోతు బుబలుస్ ఆర్నీ, కొన్ని మాత్రమె ఉండే రెడ్ పాండా లకు నిలయం. బల్పక్రం లో ఆసియా ఏనుగులను కూడా చూడవచ్చు. మేఘాలయ రాష్ట్రంలో కూడా బైసన్ లు మాత్రమే కనిపిస్తాయి.
కాండం చుట్టూ ఒక వింత వలయం గల బోల్దాక్ చెట్టు వున్న బోల్దాక్ మాచు కరం అనే ప్రాంతం లాంటి ప్రసిద్ధ పర్యాటక స్థలాలు ఇక్కడ వున్నాయి. అలాగే చిదిమాక్ అనే పేరు గల ఒక చిన్న కొలనులో నీరు బొగ్గులా నల్లటి రంగులో వుంటాయి. తరువాత, జంతువుల పాద ముద్రలు వున్న మాచ్రు అనే పెద్ద రాయి ఇక్కడ వుంది, కానీ చుట్టూ వుండే ఇతర రాళ్ళన్నీ నునుపుగానే వుంటాయి. అలాగే తన దగ్గరికి వెళ్ళిన ప్రతి ప్రాణిని తనలోని గొయ్యి లాంటి ప్రాంతానికి ఆకర్షించే అరెంగ్ పాతాల్ అనే పెద్ద శిల కూడా వుంది, అందులోకి వెళ్ళిన వారు ఇక తిరిగి రారు.
క్షుద్ర శక్తులకు నిలయంగా భావించే గొంచో దారే అనబడే కొండ చరియ కూడా చూడదగ్గదే. తురా నుంచి, విలియం నగర్ నుంచి బల్పక్రం వెళ్ళే టూరిస్ట్ వాహనాలు అందుబాటులో వుంటాయి.