కేవలం 113 మంది తక్కువ జనాభా ఉన్న దొమ్బెవరే అనే చిన్న గ్రామం ఈమాన్ ఆసక్గ్రే నుండి 3 కిలోమీటర్ల అతితక్కువ దూరం వద్ద ఉంది.
పర్వత శిఖరంపై రహస్యాలు పెనవేసుకున్న దొమ్బెవారే ఒక ప్రశాంతమైన సరస్సు. ఇక్కడి ఇతిహాసం ప్రకారం ఒక మత్స్యపురుషుడు ఒక అందమైన వివాహితను ప్రేమించి, ఆమెను పొగరుబోతు భర్త నుంచి కాపాడి ఆమెతో కలిసి పారిపోయాడు. అతని ప్రియురాలు ఇప్పటికీ జీవించే ఉందనీ, ఆమె భూగర్భ జలాల్లో ఉంటుందనీ స్థానికులు నమ్ముతారు.
వాహనాల మీద వెళ్ళే సౌకర్యం లేని రోడ్లతో వుండే దొమ్బెవారే వెళ్ళడం అంట తేలికేమీ కాదు. ఇమాన్ ఆసక్గ్రే గ్రామానికి నాలుగు గంటలు నడిచి, అక్కడి నుంచ మరో గంటన్నర నడిస్తే దొమ్బెవారే చేరుకోవచ్చు. అయితే, ఈ పర్వతారోహణకు పడ్డ శ్రమ అంతా దొమ్బెవారే అందం చూడగానే సమంజసమే అనిపిస్తుంది.