నేన్గ్కొంగ్ మేఘాలయ సౌత్ గారో హిల్స్ జిల్లాలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం లోను, చుట్టుపక్కల మూడు గుహలు ఉన్నాయి. వాటిలో 533 కిలోమీటర్లు పొడవున్న తెతెన్గ్కోల్ బల్వాకోల్ గుహ చాలా ప్రసిద్ది చెందింది. ఇది భారతదేశంలోని ఉపఖండంలో రెండవ అతిపెద్ద గుహగా కూడా చెప్పవచ్చు.
చిబే నల నదిపై దాదాపు 2 కిలోమీటర్ల పొడవున్న దొబ్బకోల్ చిబే నల గుహ, షుమారు 1 కిలోమీటరు పొడవున్న బొక్ బక్ దోభాకోల్ ఈ ప్రాంతంలోని ఇతర రెండు ప్రసిద్ధ గుహలు. ఈ రెండు గుహలు తెతెన్గ్కోల్ బల్వాకోల్ గుహ వలే అందంగా, సాహసోపేతంగా ఉంటాయి.
నేన్గ్కొంగ్, బఘ్మర నుండి షుమారు 14 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది, దీనికి దగ్గరగా బఘ్మర టూరిస్ట్ లాడ్జ్ ఉంది.
బఘ్మర నుండి స్థానిక అద్దె టాక్సీలో నేన్గ్కొంగ్ చేరుకోవచ్చు. తుర 132 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది, తుర నుండి టూరిస్ట్ వెహికల్ బుక్ చేసుకుని నేన్గ్కొంగ్ చేరుకోవచ్చు.