సిమ్సంగ్ నది గారో హిల్స్ నడిబొడ్డు నుండి ప్రవహిస్తుంది, ఈ ప్రాంతం రెండు భాగాలుగా విభజి౦చబడింది. ఇది సరిహద్దులను దాటి బంగ్లాదేశ్ లో ప్రవహించడం వల్ల ఈ నది దాని పేరుని సోమేశ్వరి గా మార్చుకుంది. సిమ్సంగ్ నొక్రేక్ శిఖరంలో చిన్న సెలఏరులా మొదలై మధ్యలో రింగ్ది, రాంప, రోన్గ్దిక్, చిబోక్ నదుల పాయలు కూడా కలవడంతో పెద్ద నదిగా మారిపోయింది.
దాని మార్గంలో ఈ నది రోన్గ్రెంగ్రిరి, విల్లియం నగర్ (ఈస్ట్ గారో కొండల ప్రధానకార్యాలయం), నోన్గాల్బిబ్ర, రేవాక్, సిజు, బఘ్మర సౌత్ గారో కొండల ప్రధాన కార్యాలయం గుండా ప్రవహిస్తుంది.
ఈ నది బోట్ రైడ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. పర్యాటకులకు సాధారణ బోట్లు, జెట్ స్కిస్ అందుబాటులో ఉంటాయి. నదితో పాటు కదిలే లోయ నడుమ మీ స్వంత హాలీవుడ్ క్షణాలను అందిస్తుంది. ప్రతి మలుపులో ఒక రహస్య ప్రయాణం చేస్తున్నట్తో లేదా గుప్త నిధుల కోసం సాహస౦ చేస్తున్నట్లో అది మీకు ఉత్కంఠను ఇస్తుంది. ఈ నది నిజానికి తీవ్రస్థాయిలో ఊగిసలాడే ఎలక్ట్రిక్ ఈల్స్ రూపంలో దాగిన నిధులను అందిస్తుంది. ఈ నది ఫిషింగ్ కి గొప్ప ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ గొప్ప నది వద్ద ఉన్న గ్రామాలు సాధారణంగా నతోక్ వారి అనే వార్షిక ఫిషింగ్ పండుగను నిర్వహిస్తాయి. ఈ పండుగ సాధారణంగా శీతాకాల సమయంలో నిర్వహించబడుతుంది.
సెప్టెంబర్ నుండి జనవరి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.