అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

శ్రావణబెళగొళ - ఎత్తుగా నిలబడిన గోమతేశ్వరుడు

శ్రావణబెళగొళ పట్టణంలోకి ప్రవేశించకుండానే 17.5 మీటర్ల ఎత్తుగల గోమతేశ్వర విగ్రహం దూరంనుండే కనపడుతుంది. ఎత్తైన ఈ విగ్రహం సుమారుగా క్రీ.శ 978 కాలంనాటికి చెంది శ్రావణబెళగొళ పట్టణంఎంతో ప్రధానమైన జైన యాత్రా స్ధలం గా ప్రాచీన కాలంనుండి ఉన్నదనేటందుకు నిదర్శనంగా ఉంది.

శ్రావణబెళగొళ ఫొటోలు

విగ్రహాలు మరియు శిలా శాసనాలు శ్రావణబెళగొళ అంటే తెల్లటి సరస్సులో మత పరివ్రాజకుడని అర్ధం చెపుతారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏక శిలా విగ్రహాలలో ఒకటి.  విగ్రహమే కాక, శ్రావణబెళగొళ మరికొన్ని గత వైభవాలను కూడా అందిస్తుంది. రాజు చంద్రగుప్త మౌర్యుడు ఎన్నో సంవత్సరాలపాటు యుద్ధం చేసి, సభలు తీర్చి అలసిపోయి శ్రావణబెళగొళ కొండలపై ప్రశాంత జీవితాన్ని కోరుకొన్నాడు. 

దక్షిణ భారతదేశంలో జైన మతం వ్యాప్తికి ఈ రాజు ఎంతో కృషి చేశాడు. చరిత్రకారులకు ఈ పట్టణం సుమారు క్రీ.శ. 600 నుండి క్రీ.శ.1830 వరకు జరిగిన అనేక అంశాలకు సంబంధించిన శాసనాలు ప్రసాదిస్తుంది. వివిధ వంశాల రాజులు గంగ, హొయసలలు, ఒడయార్లు గురించిన సమాచారం తెలియజేస్తుంది. లిఖిత రూపంలో ఉన్న ఈ గ్రంధాలు పురాతన యుగాల జీవితాలు ఎలా ఉన్నాయనేది తెలియజేస్తాయి.

శ్రావణబెళగొళకు సమీప బస్ స్టేషన్ చన్నరాయపట్న. బెంగుళూరు, మైసూర్ ల నుండి చన్నరాయపట్న బస్ ప్రయాణం చేయవచ్చు. మిగిలిన దూరం స్ధానిక రవాణా వాహనాలు ఉపయోగించాలి.  

Please Wait while comments are loading...