Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » వాతావరణం

శ్రీ నగర్ వాతావరణం

ఉత్తమ కాలం: ఏప్రిల్ మరియు అక్టోబర్ మధ్య కాలంలో శ్రీనగర్ సందర్శించడానికి అనువైనదిగా భావిస్తారు. వేసవి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ భయంకరమైన చలిగా ఉంటుంది. వర్షపాతం తక్కువ. అనేక మంది ప్రయాణికులు శీతాకాలంలో హిమపాతం ఆస్వాదించడానికి శ్రీనగర్ చేరుకుంటారు. వేసవిలో ఈ ప్రదేశం సహజ సౌందర్యం తో అత్యద్భుతంగా ఉంటుంది.

వేసవి

శ్రీనగర్ సుందరమైన కాశ్మీర్ లోయ మధ్యలో ఉంది. ఈ ప్రదేశం సంవత్సరం పొడువునా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. రెండు ప్రధాన రుతువులు వేసవి మరియు శీతాకాలం. వర్షపాతం ఇక్కడ చాలా తక్కువ. శ్రీనగర్ లోని శీతాకాలాలు చాలా చల్లగా మరియు భారీ హిమపాతం తో ఉండగా వేసవులు చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటాయి. శ్రీనగర్ వాతావరణ పరిస్థితులు 10 చదరపు కిమీ విస్తారము లో పూర్తి చిత్తడి భూమి, సరస్సు కలిగి ఉన్న ప్రసిద్ధ హోకేసర్ మాగాణినేల చే విపరీతంగా ప్రభావితమవుతాయి.వేసవి కాలం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్): శ్రీనగర్ వాతావరణం వేసవి కాలంలో చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 33 డిగ్రీల వరకు వెళ్ళవచ్చు.రాత్రి సమయంలో 10 డిగ్రీల వరకు క్రిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. యాత్రికులు పెద్ద సంఖ్యలో సహజ సౌందర్యాన్ని వీక్షించేందుకు వేసవిలో శ్రీనగర్ సందర్శిస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతంలో గల సరస్సులు మరియు ఉద్యానవనాలు అన్ని వైపుల నుంచి ప్రజలను ఆకర్షిస్తుంటాయి.  

వర్షాకాలం

శ్రీనగర్ లో వర్షాకాలం అతి తక్కువ. సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుంచి మార్చి): శ్రీనగర్ శీతాకాలంలో చల్లని వాతావరణం కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రతలు శీతాకాలంలో 0 డిగ్రీల క్రిందికి వెళ్ళే అవకాశం ఉంది, అయితే గరిష్ట ఉష్ణోగ్రత ఇప్పటివరకు 15 డిగ్రీల కంటే ఎక్కువ నమోదు కాలేదు. భారీ సంఖ్యలో సందర్శకులు హిమపాతం చూడటానికి ఈ కాలంలో శ్రీనగర్ కు వస్తారు. మంచు తో కప్పు బడిన పర్వతాలు వాటి సహజ అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి.