అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

శ్రీశైలం - ఒక పవిత్ర నగరం

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో నల్లమల కొండలలో చిన్న పట్టణం శ్రీశైలం హిందువులకు చాలా పవిత్ర మైనది. ఈ పట్టణం కృష్ణ నది ఒడ్డున కలదు.  హైదరాబాద్ ఈ పట్టణానికి సుమారు 212 కి. మీ. ల దూరం వుంటుంది. ఎంతో పవిత్ర యాత్రా స్థలంగా భావించే ఈ శ్రీశైలం పట్టణానికి లక్షలాది హిందువులు ప్రతి సంవత్సరం దేశం లోని అన్ని మూలల నుండి వచ్చి దర్శించుకుంటారు. ఈ టవున్ లో అనేక దేవాలయాలు, తీర్థాలు కలవు. భక్తులకు, పర్యాటకులకు కావలసిన వివిధ రకాల ఆకర్షణలు ఇక్కడ కలవు.

శ్రీశైలం ఫోటోలు, శ్రీశైలం డాం నీటి  ప్రవాహం
Image source: commons.wikimedia.org

ఇక్కడి దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో  శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడు గా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబ గా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాల లో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటి లో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.

శ్రీశైలం కు ఎయిర్ పోర్ట్ లేదా రైలు స్టేషన్ లేనప్పటికీ తేలికగా చేరగల చక్కటి రోడ్ మార్గం కలదు. ఇది ఒక ఉష్ణమండల ప్రదేశం కావున, వేసవులు అధిక ఉష్ణోగ్రతలు కలిగి పర్యాటకులకు అసౌకర్యంగా వుంటుంది. శ్రీశైలం చూడాలంటే శీతాకాలం అనుకూలమైనది.

Please Wait while comments are loading...