ఎడక్కల్ గుహలు నవీన యుగం నాటివి. ఇవి సుల్తాన్ బతేరి కి సుమారు 12 కి.మీ. దూరంలో కలవు. ఇవి అమ్బుకుతి పర్వతాలపై సుమారు 1000 మీటర్ల ఎత్తున ఉంది పర్యాటకులను అన్ని కాలాల లో ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ గుహలలో కల చిత్రపు చెక్కడాలు, శిలా శాసనాలు చరిత్రకారులకు మరియు పర్యాటకులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. పురాతన కాలంలో మానవ స్థావరాలు ఉన్నాయనే దానికి ఈ గుహలు నిదర్శనంగా ఉంటాయి. ఈ గుహల గోడలు వివిధ పురాతన శిలా శాసనాలు, వివిధ జంతువులు, మానవుల చిత్రాలు, పురాతన ఆయుధాలు బొమ్మలు, గుర్తులు కలిగి ఉంటాయి. ఇవన్నీ సుమారు 7000 సంవత్సరాల కిందటివి గా చెపుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఇవి పురావస్తు మరియు చరిత్ర కారుల దృష్టిలో కలవు. ఈ ప్రదేశం ట్రెక్క ర్లకు మరియు ప్రకృతి ప్రియులకు ఆనందం కలిగిస్తుంది. ఉదయమే చేసే ట్రెక్ సందర్శకుల మనసు మరియు శరీరాలను ఉత్సాహ పరుస్తుంది.