తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి సుర్ గూజ జిల్లా లో ఉత్తర ప్రదేశ్ సరిహద్దు లో కలదు. ఇక్కడ కల తమోర్ హిల్ మరియు పింగళ నల్ల ల పేరు పై దమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సంక్చురి అని పెట్టారు. ఈ ప్రదేశం లో ఇవి అతి పురాతనమైనవి. మొరన్ నది ఈ సంక్చురి గుండా ప్రవహించి ఉత్తర ప్రదేశ్ లోని గోవింద వల్లభ ప్యాంటు సాగర్ రిజర్వాయర్ చేరుతుంది.
ఇది అంబికాపూర్ నుండి 100 కి. మీ. లు సూరజ్ పూర్ నుండి 35 కి. మీ. ల దూరంలో సుమారు 600 చ. కి. మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి వుంటుంది. ఈ సంక్చురి లో వివిధ రకాల మొక్కలు, జంతువులు కలవు. ఇక్కడకు పింప్రి రైలు స్టేషన్ సమీపం. ఇక్కడ సాల్, బంబూ అడవులు కూడా కలవు. టైగర్ , చిరుత, ఎలుగుబంటి సాంబార్ లేడి, బ్లూ బుల్ చితాల్, బైసన్ వంటి జంతువులు , వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడ కలవు.
ఈ సంక్చురి సందర్శనకు నవంబర్ నుండి జూన్ వరకు ఉత్తమ సమయం. జార్ఖండ్ లోని రాంచ్, ఉత్తర ప్రదేశ లోని వారణాసి ఎయిర్ పోర్ట్ లు దీనికి సమీపం. సమీప రైలు స్టేషన్ సూరజ్ పూర్ లో కలదు. టూరిస్ట్ లు, పరిశోధకులు రంకోల లేదా అంబికాపూర్ లలో వసతి పొందవచ్చు.