మణిపూర్ లోని తమెంగ్లాంగ్ లో నారింజకాయలు అత్యధికంగా ఉత్పత్తి అవుతాయి. అక్కడ ప్రతి సంవత్సరం ఎక్కువగా వ్యాపారం జరగటం కొరకు మరియు పర్యాటక రంగంను మెరుగుపరిచేందుకు ఆరెంజ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ లో పాల్గొనటానికి జిల్లా,రాష్ట్రము మరియు మిగిలిన ప్రాంతాల నుండి వస్తారు. ఆరెంజ్ ఫెస్టివల్ డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.
ఆరెంజ్ ఫెస్టివల్ ను జిల్లాలో అతి పెద్ద పరిమాణంలో పండ్లను ఉత్పత్తి చేయటానికి ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు రాష్ట్రంలో సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలు పెంచడానికి సహాయపడుతుంది. నేడు ఈ ఆరెంజ్ ఫెస్టివల్ మణిపూర్ ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా ఉంది.
అంతే కాకుండా వ్యాపారులకు ఆరెంజ్ పండుగ సంగీత మరియు సాంస్కృతిక కార్యక్రమాలు సమయంలో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచడానికి ఒక వేదికగా ఉంటుంది. పండుగ ప్రధాన ఆకర్షణల్లో ఒకటైన ఆరెంజ్ బ్యూటీ క్వీన్ పోటీలో పాల్గొనటానికి రాష్ట్ర నలుమూలల నుండి అమ్మాయిలు వస్తారు.