సందర్శకులను విస్తారంగా స్వర్గపు ఆనందంలో ముంచడానికి భూమిపై ఏదైనా ఉంది అంటే అది సెలా పాస్. శీతాకాలంలో, సెలా పాస్ తెల్లని మంచుతో అందంగా అలంకరించబడి, సందర్శకుల కళ్ళకు అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ఈ ప్రాంతం సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో నిండి ఉంటుంది, సంవత్సరం మొత్తం అద్భుతాన్ని అందించి, స్వర్గాన్ని కనబరుస్తుంది.
తూర్పు హిమాలయ శ్రేణిలోని ఈ భాగం బౌద్ధ మతస్తులకు ప్రసిద్ది చెందింది, సెలా పాస్ లోను, చుట్టుపక్కల ఉన్న 101 సరస్సులు బౌద్ధ సమాజం కోసం ఒక పెద్ద మత ప్రాముఖ్యతను కలిగిఉన్నాయని నమ్మకం. సెలా పాస్ శీతాకాలంలో భారీమంచును కలిగి ఉంటుంది, అయితే కొండ చేరియలు, మంచుతో తాత్కాలికంగా మూసి ఉంటుందే తప్ప, అది సంవత్సరం పొడవునా తెరిచే ఉంటుంది.