Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలాసేరీ » వాతావరణం

తలాసేరీ వాతావరణం

ఉత్తమ సమయం తలసేరీ లో తీవ్రమైన వేసవి, అధిక వర్షపాతం వల్ల ఈ రెండు కాలాలలో ఈ ప్రాంత సందర్శనను నివారించడం ఉత్తమం. శీతాకాలం చివరి వరకు (అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు) ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమ సమయం. తలాసేరీ సంబరాలలో పాలుపంచుకోవాలి అనుకునేవారు ఓనం సీజన్లో (ఆగస్ట్ నుండి సెప్టెంబర్ వరకు) సందర్శించవచ్చు.   

వేసవి

వేసవి తలాసేరీలో వేసవి వేడిగా, తీవ్రంగా ఉంటుంది. తలసేరీ లో వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీలతో అధికంగా ఉంటుంది. ఈ సమయంలో తలసేరీ ని స౦దర్శించడం సమంజసం కాదు. అయినప్పటికీ సందర్శించాలి అనుకునేవారు కాటన్ దుస్తులు తీసుకువెళ్ళడం మంచిది.

వర్షాకాలం

వర్షాకాలం కేరళలో ఏ ఇతర పట్టణంలో లాగా, తలసేరీ లో వర్షాకాలం జూన్ నుండి ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. తీరప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల, ఈ పట్టణం లో వర్షపాతం అధికంగా ఉంటుంది. ఎడతెరిపిలేని వర్షాలు స్థల సందర్శనకు వీలు కల్పించావు కాబట్టి ఈ సమయంలో తలసేరీ ని సందర్శించడం సరైనది కాదు.

చలికాలం

శీతాకాలం తలసేరీ లో శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా, ఆహ్వానించే వాతావరణం ఉంటుంది. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు 32 డిగ్రీల మధ్య ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి కోటలు, తోటలు, ఇతర వారసత్వ భవనాల సందర్శనకు సరైన సమయం.