Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థానే » వాతావరణం

థానే వాతావరణం

సందర్శనకు సరైన సమయంథానే లో వాతావరణం ఇంచుమించు ముంబై లో లాగానే ఉంటుంది. సాధారణంగా ఇది వేడిగా, తేమగా ఉంటుంది. ఈ కాలంలో పర్యటన అసౌకర్యంగా ఉండటం వల్ల యాత్రీకులు వేసవిలో రావడం మానేస్తారు. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు వర్షాకాలం తరువాత, శీతాకాలం లో ఈ ప్రాంతం సందర్శించడం ఉత్తమం.

వేసవి

థానే – వాతావరణంవేసవిథానే లో మార్చ్ నుంచి జూన్ నెలవరకు వేసవి కాలం ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత లు 32 నుంచి 42 డిగ్రీల మధ్య ఉంటాయి. అయితే, అరేబియా సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం మరీ వేడేక్కదు.

వర్షాకాలం

వర్షాకాలంవేసవి తరువాత వేడినించి ఉపశమనం కలిగిస్తూ వర్షాలు పడతాయి. థానే లో వర్షాకాలం మార్చ్ నుంచి జూన్ వరకు ఉంటుంది. ఆ సమయంలో నైరుతి ఋతుపవనాల వల్ల ఇక్కడ విస్తారంగా వర్షాలు పడతాయి. జులై నెలలో అన్నిటికన్నా ఎక్కువ వర్షం పడుతుంది.

చలికాలం

శీతాకాలండిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు థానే లో శీతాకాలం నడుస్తుంది. అన్ని ఉష్ణ మండల ప్రాంతాలలో లాగే ఈ స్థల సందర్శనకు శీతాకాలం అనువైన సమయం. కనిష్టంగా 8 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలు సగటున 15 డిగ్రీలు ఉంటాయి.