Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తేక్కడి

తేక్కడి - ప్రకృతి ప్రసాదించిన వరం!

24

చుట్టూ దట్టమైన అడవి, ఆ అడవిలో పచ్చటి పచ్చిక బయళ్లు, దారి పొడవునా గలగలా పలుకరించే సెలయేళ్లు, ఈ సెలయేటి నీళ్లకోసం వచ్చే అడవి జంతువులు...

వీటన్నింటినీ చూడాలంటే ఇడుక్కి జిల్లాలోని తేక్కడి అటవీ ప్రాంతానికి చేరుకోవాల్సిందే. మరియు అద్భుతమైన,ఆకర్షణనీయమైన ప్రయాణాలు చేసే పర్యాటకులకు ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఇక్కడి అడవి జంతువులకు ఆవాసమైన పెరియార్‌ వన్యమృగ సంరక్షణా కేంద్రం పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది.

తేక్కడి కేరళ-తమిళనాడు సరిహద్దు దగ్గరగాఉంటుంది.మరియు అందువలన ఇక్కడ ఒక ప్రత్యేక సంస్కృతి మరియు సంప్రదాయం ఉంటుంది.కేరళ మరియు తమిళనాడు రెండు ప్రాంతాల వారికీ అందుభాటులో ఉంటుంది.కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో తమిళనాడు రాష్ట్ర సరిహద్దు పట్టణమైన కుమిలీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.తేక్కడి వన్యమృగ సంరక్షణా కేంద్రం సందర్శన కు దేశం నుండి,విదేశాల నుండి ప్రతి సంవత్సరం రెండు నుండి అనేక మిలియన్ల పర్యాటకులు వస్తారు.ఈ సంరక్షణ కేంద్రంలో వివిధ రకాల పక్షులు, జంతువులు మనకు కనిపిస్తాయి.

మంత్ర ముగ్ధుల్ని చేసే ప్రకృతి అందాలతో మనసును రంజింప చేసే లోయలు, కొండలు... చుట్టూ అడవిలాంటి ప్రాంతం తో అందం గా ఉంటుంది.ఈ కొండ ప్రాంతాల్లో ప్రకృతి దృశ్యాలు మరియు తోటల పెంపకానికి అధికంగా విస్తరించారు. ఇక్కడ పండే మసాలా దినుసులు అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఇక్కడ వీచే గాలిలోనే మీరు వీటి వాసనను రుచి చూడవచ్చు.

ఉదయం పూట ఫొటోగ్రఫీకి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో పర్యటిస్తే బాగుంటుంది.చల్లని వాతావరణం మరియు అద్భుతమైన రిసార్ట్స్ మరియు అడవి మధ్యలో నిర్మించిన కాటేజీ లుఉంటాయి.హనీమూన్ జంటలకు, పిక్నిక్ లకు ఇది ఒక మంచి స్పాట్. ట్రెక్కింగ్ ట్రయల్స్ సర్పిలాకార కొండ ప్రాంతాలు, పొడవుగా సాగుతుంది అధిరోహణ మరియు పర్వతారోహకులు ఒక మంచి అనుభవాన్ని పొందుతారు.ఈ ప్రాంతంలో సరిహద్దులో నడక, వన్యప్రాణుల రైలు, Rock అధిరోహణ మరియు వెదురుబొంగులలో తెప్ప నడపడం సహా అనేక వినోద కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకొంటుంది.

పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం

తేక్కడి ప్రాంతాన్ని పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు.ఇక్కడ ఈ పార్క్ ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గడించినది.తేక్కడిలో ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు, పొడవైన నీలగిరి కోతులు, పులులు, చిరుత పులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు... తదితరాలు పర్యాటకులను అలరిస్తున్నాయి.

తేక్కడి అటవీ ప్రాంతంలోని జంతువుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1978వ సంవత్సరంలో పెరియార్‌ శాంక్చురీని ఏర్పాటు చేసింది.ఈ ప్రాంతంలో అద్భుతమైన బోటింగ్ సౌకర్యాలు అందించే పెరియార్ నది,అలాగే.. పడవల్లో ప్రయాణిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, జంతువులను అతి దగ్గర్నించీ చూడటం ఇంకో ప్రత్యేకత.మరియు సరస్సులో ఉండే ఏనుగు మందలను చూడటం ఒక మంచి అనుభూతి.

కేవలం వన్యమృగాలకు నిలయం మాత్రమే కాకుండా.. ఇక్కడి అడవిలో రకరకాల సుగంధ ద్రవ్యాలు,కాఫీ తో కూడిన చెట్లు పెరుగుతుంటాయి.ఇంకా ఇక్కడ అబ్రహం యొక్క స్పైస్ గార్డెన్, కధతనాధన్ కలారీ సెంటర్ (ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధచెందిన మార్షల్ ఆర్ట్ కలారీ కేంద్రం) మరియు మంగళ దేవి ఆలయం చూడవలసిన ప్రదేశాలు.

వందనమేడు అనే పల్లెలో ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన అతి పెద్ద ఏలకులు తోట ఉంది.ఇక్కడకు ప్రతి సంవత్సరం లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు.ఇక్కడి అడవిలో రకరకాల సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, మిరియాలు, పచ్చిపోకలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కలతో కూడిన చెట్లు పెరుగుతుంటాయి.ఇక్కడ ఉన్నత నాణ్యత కలిగి ఉన్న మసాలా దినుసులను కొనుగోలు చేయవచ్చు.సాంప్రదాయకంగా తయారు చేసే వంటకాల్లో ప్రాంతం మరియు కేరళ ఆహార రుచిలో రెస్టారెంట్లు ఉంటాయి.

ఆహ్లాద వాతావరణము

తేక్కడిలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.చల్లని వాతావరణంను కలిగి ఉంటుంది,మరియు ఒక అద్భుతమైన పిక్నిక్ స్పాట్ గా ఉంటుంది.తేక్కడి కేరళ మరియు తమిళనాడు రెండు వైపుల నుండి,మరియు బస్సు సర్వీసెస్ మధురై, కుంబం, కొచీ (165 km), కొట్టాయం (120 km),ఎర్నాకులం మరియు తిరువంతపురం (250 km) సహా అనేక ప్రదేశాల నుండి అందుబాటులో ఉన్నాయి.

తేక్కడిలో వసతి సౌకర్యాలు మరియు టూర్ ప్యాకేజేస్,బడ్జెట్ హోటళ్లు అన్ని ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు అందుభాటులో ఉంటాయి.సెలవు రిసార్ట్స్ ఉన్నాయి.ఇక్కడ సాహస కార్యక్రమాలు, విశ్రాంతి,వినోదం అన్ని ఉన్నాయి.ఇక్కడకు వచ్చిన ప్రతి పర్యాటకుడు ఆనందంగా గడుపుతాడు.

 

తేక్కడి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తేక్కడి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తేక్కడి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తేక్కడి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కేరళ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (KSRTC) తేక్కడికి కొచీ, కొట్టాయం మరియు తిరువంతపురం నుండి నిరంతరం బస్సు లను నడుపుతుంది.తమిళనాడు లో కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే తేక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రం.తేక్కడి కి ఎన్నో టూర్ ప్యాకేజేస్ అందుబాటులోఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం తేక్కడికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కొట్టాయం (120 km) లో ఉంది. రెగ్యులర్ రైళ్లు కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి బెంగుళూర్, చెన్నై, హైదరాబాద్, Ernakulam, తిరువంతపురం మరియు న్యూ ఢిల్లీ, భారతదేశం లో అన్ని ప్రధాన నగరాలకు అందుబాటులో ఉన్నాయి. కొట్టాయం నుండి తేక్కడికి కారులో వెళ్ళటానికి 2500-3000రూపాయలు ఖర్చు అవుతుంది. బస్సులు కూడా అందుబాటులోఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం మధురై తేక్కడి(140 km) కు సమీప విమానాశ్రయం, సమీప అంతర్జాతీయ విమానాశ్రయంను Nedumbassery అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు.కొచ్చి నుంచి 190, తిరువనంతపురం నుంచి 190, కోజికోడ్‌ నుంచి 135, చెన్నై నుంచి 570 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.190 కి.మీ. దూరంలో ఉన్న, కొచీ విమానాశ్రయం నుండి భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలు మరియు విదేశాలలో ఉన్న కొన్ని నగరాలకు కలపబడింది. విమానాశ్రయం నుంచి తేక్కడి కి కారులో వెళ్ళటానికి 4000 రూపాయలు ఖర్చు అవుతుంది.లేదా తేక్కడి చేరుకోవడానికి విమానాశ్రయం నుండి బస్సులు కూడా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun