అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

థేని - గాలిలో సుగంధ ద్రవ్యాల సువాసనలు !

తమిళ్ నాడు లో తేని, ఒక ముఖ్యమైన జిల్లా. ఈ జిల్లా ఇటివలే ఏర్పడింది. ఇది పడమటి కనుమల ఒడిలో కలదు. ఒక హాయి అయిన వారాంతపు సెలవుకు ఈ ప్రదేశానికి చేరుకొని ఆనందించవచ్చు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా లో పెరియకులం, ఉతమపలయం మరియు అందిపత్తి వంటి ప్రదేశాలు కలవు. అందిపత్తి హస్త కళా వస్తువులకు మరియు చేనేత లకు ప్రసిద్ధి. మీరు తేని లో కనుక వుంటే ఇక్కడ మీరు మెత్తని టవల్స్, రుచికర మామిడి పండ్లు, చక్కని సిల్క్ కాటన్, సుగంధాల యాలకులు, ఖారంగా వుండే మిర్చి, తాజా కాఫీ గింజలు, మరియు

థేని ఫోటోలు, మేఘ మలాయి హిల్స్
Image source: commons.wikimedia.org

ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటివి కొనుగోలు చేయాల్సిందే. డాములు, టెంపుల్స్ మరియు జలపాతాలు - తేని లోను మరియు చుట్టుపట్ల కల ఆకర్షణలు

తేని లో అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. ది వాగాయి డాం, సోతుప్పరాయి డాం మరియు శంముగానాతి డాం వంటివి కొన్ని చక్కని విహార ప్రదేశాలు. ఇక్కడ సురులి ఫాల్స్, కుమ్బక్కరాయి ఫాల్స్ మరియు చిన్న సురుయిల్ ఫాల్స్ వంటి అద్భుత జలపాతాలు కూడా కలవు. తేని లో అనేక టెంపుల్స్, మందిరాలు కూడా కలవు.

కుచానూర్, మవూతు, తీర్థ తొట్టి, గౌమారి అమ్మన్ టెంపుల్, దేవదానపత్తి, కామాక్షి అమ్మన్ టెంపుల్ మరియు బాలసుబ్రమణ్య టెంపుల్ లలోదేశ వ్యాప్తం గా వచ్చే భక్తులు పూజలు నిర్వహిస్తారు. తేని లో ఇంకనూ మేఘమాలి హిల్స్, బోడి మెట్టు మరియు పరవశ ఉలగం వాటర్ ధీం పార్క్ కూడా కలవు.

పండుగలు, వేడుకలు

థేని పట్టణ ప్రజలు పొంగల్, శివరాత్రి, మాసి మహం వంటివి చేసుకుంటారు. ఈ పండుగలు ఫిబ్రవరి , మార్చ్ నెలల్లో వస్తాయి. ప్రసిద్ధి చెందినా ఎద్దు పందేలు ఇక్కడ ఈ పండుగ సమయం లో నిర్వహిస్తారు.

థేని సందర్శనకు ఉత్తమ సమయం

థేని ని సంవత్సరం లో ఎపుడైనా సరే పర్యటించవచ్చు. అయినప్పటికీ ఈ క్ప్రదేశాన్ని పండుగ సమయం లో దర్శించి ఆనందించటం మంచిది. పైగా ఈ సమయం లో ఉష్ణోగ్రతలు తక్కువగా వుంది ప్రదేశం ఆహ్లాదకరంగా వుంటుంది.

థేని ఎలా చేరాలి ?

తేని ని రైలు, రోడ్, మార్గాలలో ప్రధాన పట్టణాల నుండి చేరవాచ్చు. మదురై లో సమీప విమానాశ్రయం కలదు.

Please Wait while comments are loading...