కులతుపూజ కొల్లం జిల్లలో ఒక అందమైన గ్రామం. తేన్మలై పర్వత ప్రాంతానికి ఇది సమీపంలో ఉంటుంది. తిరువంతపురం – శేన్కోట్టాయి మార్గంలో కలదు. తిరువనంతపురం కు 62 కి.మీ. మరియు కొల్లం కు 64 కి.మీ. దూరంలో ఉంటుంది. కులుతుపూజ దాని శాస్త దేవాలయానికి ప్రసిద్ధి. ఇక్కడ బాల శాస్త దేవి అంటే హరిహర ప్రియ ప్రధాన దైవం. కల్లాడ నది ఒడ్డున కల ఈ దేవాలయం సందర్శకులకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించే ప్రధాన పండుగ విష్ణు మహోత్సవం భక్తులను మరియు పర్యాటకులను ఒకే రకంగా ఆకర్షిస్తుంది. ఈ గ్రామంలో రిజర్వు ఫారెస్ట్ సుమారు వేయి కి.మీ. ల విస్తీర్ణంలో కలదు. కులతుపూజ కు సమీపంలో రాక్ వుడ్ ఎస్టేట్ మరియు శెండురిని వైల్డ్ లైఫ్ శంక్చురి లు ప్రధాన ఆకర్షణ. ఈ గ్రామం మూడు అయ్యప్ప దేవాలయాలను అంటే కులతుపూజ, ఆర్యంకావు మరియు అచ్చంకోవిల్ లను కలుపుతుంది. ఈ చిన్న గ్రామం ఎల్లపుడూ బిజీగా వుండే పట్టణ వాసులకు ప్రశాంతతనిస్తుంది. .