Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరునగేశ్వరం » ఆకర్షణలు » నాగనాథ స్వామి ఆలయం

నాగనాథ స్వామి ఆలయం, తిరునగేశ్వరం

2

రాహువుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కుంబకోణం నగర౦ నుండి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది. ఈ ఆలయం తన సహచరి గిరి గుజాంబిక (పార్వతి) తో కలసి ఉన్న నాగనాథస్వామి (శివుడు) కు చెందినది. ఈ దేవత రెండు ప్రక్కల సరస్వతి, లక్ష్మీదేవి ఉన్నారు. ఈ ఆలయంలో తన ఇద్దరు భార్యలు నాగకన్ని, నాగవల్లి లతో కూడిన రాహు భగవానుని సందర్శకులు చూడవచ్చు. రాహువు ఒక శాపం నుండి విముక్తి పొందటానికి ఈ ఆలయంలో శివుని పూజించాడు. ఇతర దేవాలయాలలో రాహువు సర్పముఖాన్ని కల్గి ఉండి నాగనాధ్ స్వామి ఆలయంలో మానవ ముఖాన్ని కల్గి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

ఈ ఆలయంలో కొన్ని మండపాలు, బురుజుల గోపురాలు, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడల్లా ఉండి, బయటి ప్రాకారాలతో కలసి ఉన్న 4 ప్రవేశ బురుజులను చూడవచ్చు. రాహుభగవానుని విగ్రహం నైరుతి మూలలో ఉంది.

ఈ ఆలయంలో దక్షిణం వైపున 4 మండపాలతో కూడి చుట్టూ రథం రూపంలో 100 స్థూపాల మండప౦ ఉన్న ఒక చెరువును చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం చోళుల శైలిని పోలి ఉంటుంది. క్షీరాభిషేకం సమయంలో రాహువు విగ్రహంపై పోసిన పాలు నీలిరంగులోనికి మారి ప్రతి ఒక్కరికి కనబడటం ఈ ఆలయం లోని ఒక ముఖ్య లక్షణ౦.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun