నగరానికి ఉత్తరాన నెహ్రు పార్క్ ఉంది. బీచ్ రోడ్ లో ఉన్న ఈ పార్క్ ఇదివరకు 'కోట్స్ ఇండియా' వారిచే నిర్వహించబడినది. ప్రస్తుతం మున్సిపాలిటీ వారి అధీనం లో ఈ పార్క్ ఉంది. తూథుకుడి లో ఉన్న నెహ్రు పార్క్ రాజాజీ పార్క్ గా కూడా ప్రసిద్ది. ఈ పార్క్ లో ఉన్న పెద్ద నీటి నిల్వల వల్ల ఇది స్థానికులలో వాటర్ ట్యాంక్ గా ప్రసిద్ది.