తూథుకుడి నగరం నుండి 4 కిలో మీటర్ల దూరంలో ఈ రోచ్ పార్క్ ఉంది. తీరం వెంట ఉండే ఈ పార్క్ పోర్ట్ వెళ్ళే దారిలో ఉంది. అందమైన మరియు ప్రశాంతమైన సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఇది పిక్నిక్ స్పాట్ గా కూడా ప్రసిద్ది. సెలవులు అలాగే పండుగ వేళల్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.