Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరుపతి

తిరుపతి: పవిత్ర నగరం !!

29

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా ‘తిరు’, ‘పతి’ అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో ‘తిరు’ అంటే గౌరవప్రదమైన అనీ, ‘పతి’ అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం ‘గౌరవనీయుడైన పతి’ అని అర్ధం. నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు. తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహి౦చి, పునర్నిర్మించారు. 14, 15 శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది. అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తన్ను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షి౦చదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచి వుంది. 1933లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పడి పరిపాలనా వ్యవహారాలూ చూసుకునేలా మద్రాస్ శాసనసభశాసనసభ ఒక చట్టం చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలూ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. ధార్మిక విషయాల్లో ధార్మిక సలహా మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇచ్చేది. తిరుపతి నగరం ఇప్పటి కే టి రోడ్ లో కొత్తూరు లో వుండేది. తరువాత అది గోవిందరాజస్వామి దేవలాయం దగ్గరికి మారింది. ఇప్పుడు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.

పండుగలు, ఉత్సవాల నగరం :

తిరుపతి కేవలం ధార్మిక కేంద్రమే కాదు, గొప్ప సాంస్కృతిక కేంద్రం కూడా. ఇక్కడ జరిగే ఉత్సవాలు, పండుగలకు తిరుపతి ప్రసిద్ది. మే లో జరిగే గంగమ్మ జాతర బాగా ప్రసిద్ది చెందిన పండుగ. అసాధారణమైన వేడుకలకు ఈ పండుగ పెట్టింది పేరు. ఈ పండుగప్పుడు, భక్తులు మారువేషాల్లో గుడి వీధుల్లో తిరిగితే దుష్ట శక్తులనుంచి రక్షణ వుంతునదని నమ్ముతారు. ఇలా నడిచాక వాళ్ళు గంధం పూసుకుని, తలకు మల్లెల దండలు చుట్టుకుని గుళ్ళోకి వెళ్తారు. దేవత మట్టి విగ్రహాన్ని పగులగోత్తడంతో జాతర ముగుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు దూరప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. చంద్రగిరి కోట లో నిర్వహించే విజయనగర ఉత్సవం, రాయలసీమ నృత్య, ఆహార పండుగలు ఇక్కడ జరిగే ఇతర ప్రధాన పండుగలు.

చూడాల్సిన ఆకర్షణలు :

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు. చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు. చెక్క బొమ్మలు, తెల్ల చెక్కతో చేసిన వస్తువులు, కలంకారీ చిత్రాలు, తంజావూర్ బంగారు ఆకుల చిత్రాలు, మరీ ముఖ్యంగా చందనపు బొమ్మలు లాంటి ఇక్కడి కళాకృతులు కూడా చూడాల్సిందే. తిరుపతి ప్రయాణం చాలా తేలిక. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది. డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది. చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అద్దె కార్లు, బస్సులు అందుబాటులో వుండడం వల్ల నగరంలో తిరగడం కూడా తేలికే. నామమాత్రపు ధరల్లో రోజంతటికీ కార్లు అద్దెకు తీసుకోవచ్చు.

వాతావరణం – రవాణా సౌకర్యాలు :

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది. ఇక్కడ వేసవి చాలా వేడిగా వుంది అసౌకర్యంగా వుంటుంది కనుక, ఆ సమయంలో ఇక్కడికి రాకుండా వుండడం మంచిది. వర్షాలు వేసవి నుంచి ఉపశమనం ఇస్తాయి, తేలిక పాటి వర్షాలు తిరుపతి అందాన్ని ఇనుమడింప చేస్తాయి. తిరుపతి ప్రధానంగా గుళ్ళు వుండే నగరం కనుక, చాలా పవిత్రంగా భావించబడుతుంది కనుక, యాత్రికులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సంప్రదాయ దుస్తులు ధరించండి, టోపీ, కేప్ లు పెట్టుకోకండి. ఇక్కడి పూలు దేవుడి కైకంకర్యానికే వాడాలి కనుక తలలో పెట్టుకోకండి. మాంసం మద్యం పూర్తీగా దొరకవు, వాడకం నిషేధం కూడా. ఫోన్ లు, కెమెరాలు లాంటి గాడ్జెట్ లు గుడిలోకి అనుమతించబడవు. ధర్మం, సంస్కృతి ప్రేమించే ప్రతి పర్యాటకుడు తప్పక చూసి తీరవలసిన ప్రాంతం తిరుపతి.

 

తిరుపతి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరుపతి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరుపతి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరుపతి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed