Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుపతి » వాతావరణం

తిరుపతి వాతావరణం

సరైన సమయం సంవత్సరంలో వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో తిరుపతిని సందర్శించడం ఉత్తమం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు తిరుపతి సందర్శనకు అనువైన పరిస్థితులను అందిస్తాయి. అయితే, జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో జరిగే ప్రధాన పండుగ బ్రహ్మోత్సవ సమయంలో యాత్రికులు తిరుపతిని సందర్శించడం ఉత్తమం.  

వేసవి

వేసవి వేసవి కాలంలో తిరుపతి లో వాతావరణం చాలా అసౌకర్యంగా ఉండడం వల్ల ఈ సమయంలో పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించరు. ముఖ్యంగా ఇక్కడ ఏప్రిల్, మే నెలల్లో 40° -45° డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం జులై, సెప్టెంబర్ నెలలలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి, అయినప్పటికీ అక్టోబర్, నవంబర్ మాసాలలో తరచుగా భారీ వర్షాలు పడతాయి. ఈ వర్షాల రాకతో ఉపశమనం కలుగుతుంది. తేలికపాటి వర్షాల సమయంలో తిరుపతి అందంగా, తాజాగా కనిపిస్తుంది.  

చలికాలం

శీతాకాలం సంవత్సరంలో డిసెంబర్, ఫిబ్రవరి నెలలలో ఉండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం ఉత్తమం. ఇక్కడి ఉష్ణోగ్రత 15° - 30 ° ల మధ్య ఉంటుంది. ఇక్కడి ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత చాలామంది ప్రయాణీకులకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది.