Search
  • Follow NativePlanet
Share
» »గుండాలకోన - తిరుపతి కి 77 km ల దూరంలో ఉన్న ఒక అద్భుత ప్రదేశం !

గుండాలకోన - తిరుపతి కి 77 km ల దూరంలో ఉన్న ఒక అద్భుత ప్రదేశం !

By Staff

<strong>కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం !</strong>కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం !

అడవులు ... వీటి అందాలు చెప్పలేనివి. ఎందుకంటే చుట్టూరా విస్తరించిన పచ్చిక బయళ్లు, ప్రకృతి సోయగాలు వీటి సొంతం. మన దగ్గర ఉన్న అడవుల విషయానికొస్తే శేషాచలం అడవులు, నల్లమల్ల అడవులు. శ్రీశైల మల్లికార్జునుడు నల్లమల్ల అడవులలో, శ్రీ వెంకటేశ్వరుడు శేషాచలం అడవులలో కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పబోయే ప్రదేశం శేషాచలం అడవులు. చల్లదనం కోసం ప్రశాంతత కోసం టూర్‌ కు వెళ్లాలని అనుకునేవారు ఫస్టు ప్రిఫరెన్స్ ఈ ఊటీ కే ఇవ్వొచ్చు.

ఇది కూడా చదవండి : అభయారణ్యంలో వేంకటేశ్వరుని దర్శనం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి : మీరు చూడని తిరుపతి .. పురాతన చిత్రాలలో..!

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి తిరుపతి రోడ్ ట్రిప్ జర్నీ !

నిన్న మొన్నటి వరకు మనం చూసినట్లయితే ఆంధ్ర - తమిళనాడు సరిహద్దులో ఒక భయానక వాతావరణం ఉండేది. దీనికి కారణం శేషాచలం అడవులలో కొంతమంది తమిళ పౌరులను ఎన్‌కౌంటర్ చేయడమే!!అసలు ఎందుకింత శేషాచలం అడవుల మీద గురిపెట్టారంటే అక్కడ దొరికే ఖరీదైన సంపదే. ఈ ప్రాంతం తిరుపతి కి దగ్గర్లోనే ఉంటుంది కాబట్టి... అక్కడికి వెళ్లినప్పుడు 'పనిలో పనిగా' నైనా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. నిజానికి నేరుగా అక్కడికే టూర్ ప్లాన్ చేసుకునేంత సుందరమైన టూరిస్టు స్పాట్ శేషాచలం కొండలు. అసలు ఏమిటి శేషాచలం అడవుల గొప్పతనం ...

ఇది కూడా చదవండి : అలిపిరి నుండి తిరుపతి మెట్ల మార్గం !

ఇప్పుడే త్వరపడండి అన్ని ఉచిత గోఐబిబో కూపన్ల కొరకు

పశుపక్షాదులు

పశుపక్షాదులు

పక్షుల పలకరింపులు, ఎత్తైన కొండలు, అబ్బురపరిచే జలపాతాలు... ఎటు చూసినా చిరుజల్లుకు ముసురుకుంటున్న పచ్చదనమే. కొండల మధ్య నడుస్తూ, సెలయేళ్లు దాటుకుంటూ చెట్లు, పొదలు తప్పించుకుంటూ అడుగు ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో అందాలు కనిపిస్తాయక్కడ. పచ్చని గొడుగు పట్టుకుని ప్రకృతి ఒద్దికగా కూర్చున్నట్టు ఆ అడవుల్లో పచ్చదనమే కాదు ఎక్కడ చూసినా గుంటలన్నీ నీటితో నిండి జలకళ ఉట్టిపడుతుంటుంది.

Photo Courtesy: BiRDiSM

బ్రహ్మజెముడు పుష్పం

బ్రహ్మజెముడు పుష్పం

ఇక్కడ మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మజెముడు పుష్పం ఎంత విశేషమో, రాతిబండలపై ఆదిమానవుడు గీశాడని భావించే పశువుల బొమ్మలు కూడా అంతే విశేషం. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్ వాచర్స్ చూస్తూ ముందుకు పోతుంటే అక్కడక్కడ గిరిజనులు పశువుల కోసం వేసుకున్న పాకలు కనిపిస్తాయి. ఊటీని తలపించే లోయల్ని చూడటం, ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్ల మధ్య నుంచి నడవటం ఒక గొప్ప అనుభూతినిస్తుంది.

Photo Courtesy: Dinesh Valke

నీలకంఠేశ్వరస్వామి ఆలయం

నీలకంఠేశ్వరస్వామి ఆలయం

విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయక్కడ. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. ఇక్కడి నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కూడా యేటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వై.కోట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయ ఉత్సవాలకు కొందరు వాహనాల్లో వెళ్తే, కొందరు కాలి నడకన వెళ్తుంటారు. కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు.

Photo Courtesy: Bharath Kumar

గుండాలు

గుండాలు

గుండాలకోన సెలయేరు పైభాగాన పసుపుగుండం, గిన్నిగుండం, అక్కదేవతల గుండం... ఇలా ఏడు గుండాలు కనిపిస్తాయి. సాధారణ గుండాల కంటే ఎక్కువ లోతుగా ఉండటం వీటి ప్రత్యేకత. గుండాల కోన నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సలీంద్ర కోన కూడా పర్యాటకులను ఆకట్టుకునే మరొక ప్రదేశం.

Photo Courtesy: Bharath Kumar

తుంబురకోన క్షేత్రం

తుంబురకోన క్షేత్రం

గలగల శబ్దాలతో ఒక అందమైన జలపాతం. దాని పక్కనే ఒక గుహ. అడవి మధ్యలోనున్న ఆ గుహలో కొలువుదీరిన తుంబుర స్వామి.చూడముచ్చటగా కనిపించే ఆ ప్రదేశమే తుంబురకోన క్షేత్రం. ఇక్కడ కూడా మహాశివరాత్రి రోజు పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు.

Photo Courtesy: Bharath Kumar

గుంజన జలపాతం

గుంజన జలపాతం

బాలపల్లె అడవుల్లో ఉన్న గుంజన నది జలపాతం నయగరా జలపాతాన్ని గుర్తుకు తెస్తుందంటే అతియోశక్తి కాదేమో! అంత అందంగా కనిపిస్తుందది. బండల మీదుగా సుమారు 500 అడుగుల లోతుకు ప్రవహించే జలధార అద్భుతం. ఈ జలపాతం గురించి చాలామందికి తెలియకపోవటం దురదృష్టం. ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. అందువల్ల రాకపోకలకు ఎంతో ఇబ్బంది. అంతేకాదు ప్రమాదం కూడా. రహదారి సౌకర్యం ఉంటే దీనికి ఎంతో గుర్తింపు వచ్చేది.

Photo Courtesy: ap tourism

ఫేమ్‌ లిల్లీ పువ్వు

ఫేమ్‌ లిల్లీ పువ్వు

ఈ అడవుల్లో ప్రధానంగా నాలుగు రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి. అవి పెర్రీత, పసలోడి గడ్డ, ఫేమ్ లిల్లీ పూలు, ఎర్రచందనం చెట్లు. పెర్రీత, పసలోడి చెట్లకు ఏర్పడే గడ్డల నుంచి రసాన్ని తీసి ఎరువులు, పురుగుమందుల తయారీలో ఉపయోగిస్తారు. విషపూరితమైన ఈ గడ్డల్ని మనుషులు తింటే చనిపోతారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి మంచి గిరాకీ ఉందని అటవీ అధికారులు చెప్తున్నారు. ఒక కిలో ఐదు వేల నుండి పది వేల రూపాయల వరకు ఉంటుంది. పెర్రీత పండ్లకు కిలో రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు ధర ఉంటుంది.

సన్నని తీగలా పెద్ద చెట్లకు అల్లుకుపోయి ఎరుపు, పసుపుపచ్చరంగులు కలగలిపిన ఫేమ్‌ లిల్లీ పువ్వులు ఎక్కడున్నా ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటి వాసనకు పది నిమిషాల్లో శరీరం మత్తెక్కిపోతుంది. వీటినీ మందుల తయారీలోనే ఉపయోగిస్తారు. ధర కిలోకు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఈ పూలకు కిలో యాభై వేల రూపాయలు ధర ఉంటుందని చెప్తారు. ఇవి అటవీ అధికారుల రక్షణలోనే పెరుగుతున్నాయి. ఈ పూలు కూడా మనుషులకు ప్రమాదమే.

Photo Courtesy: Brian Smithson

పర్యాటకులు విహరిస్తూ..

పర్యాటకులు విహరిస్తూ..

కొండెలెక్కుతున్నా, జారిపడుతూ సెలయేళ్లు దాటుతున్నా, ఇరుకుదారుల్లో నుంచి నడవాల్సి వచ్చినా ఆ కష్టమేదీ అనిపించదు. ఆ అడవి అందాలు చేసే మాయ అది. ఒక్కసారి సందర్శిస్తే చాలు... 'మళ్లీ ఓ సారి వచ్చిపో' అన్నట్టు ఆ ఆహ్లాదపు జ్ఞాపకాలు మనసులో తిష్ట వేసుకుంటాయి. పూర్తిగా ఒక కొత్త లోకంలో ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో మంచి నేస్తాన్ని వదిలివస్తున్న గాఢమైన అనుభూతికి లోనవ్వాల్సిందే ఎవరైనా.

Photo Courtesy: ap tourism

శేషాచలం అడవులకు ఎలా వెళ్ళాలి?

శేషాచలం అడవులకు ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం

తిరుపతి వద్ద ఉన్న రేణిగుంట విమానాశ్రయం ఈ శేషాచల అడవులకు దగ్గరలో ఉన్నది. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ అడవులకు చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరుపతి వద్ద ఉన్న రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

రోడ్డుమర్గం

రోడ్డు మార్గం విషయానికొస్తే రైల్వేకోడూరు నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్తే... కొట్రాల గుండాలు, చెంచమ్మకోన, వాననీళ్ళగుట్టలు, కమ్మపెంట, కుందేలుపెంట, ఏనుగలబావి, స్వామి వారి పాదాలు, సలీంద్రకోన.. మొదలైన ప్రాంతాలు ప్రకృతి అందాలకు చిరునామాగా వెలుగొందుతుంటాయి. ఎర్రచందనానికి ప్రసిద్ధిగాంచిన శేషాచలం కొండల్లోకి ట్రెక్కింగ్ వెళ్ళాలంటే ముందుగా... రేణిగుంట-కడప జాతీయ రహదారి మీదుగా కుక్కల దొడ్డి గ్రామంవద్ద ఉన్న "బాలపల్లె బంగ్లా క్యాంప్" నుంచి బయలుదేరాలి.

Photo Courtesy: Sreenivasan Ramakrishnan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X