Search
  • Follow NativePlanet
Share
» »టాలీవూడ్ హీరోలు- జన్మస్థానాలు!!

టాలీవూడ్ హీరోలు- జన్మస్థానాలు!!

సినిమా.... అంటే అదో రకమైన ఆనందం. ఆందునా తెలుగు సినిమాలంటే మహా ఇష్టం. సినిమా చూస్తున్నప్పుడు హీరొ వస్తే విజిల్లు కొడతాం, టిక్కెట్లు చింపి గాల్లో ఎగరేస్తాం అవునా, కాదా!! నేను కూడా అంతే. బహుశా సినిమాలో వాళ్ళు వేసే స్టెప్పులు, డైలాగ్ డెలివరీ ఆకర్షించింటాయి. మరి తెలుగు సినిమాలో ఎవరు ఇష్టం అంటే, ఒక్కొక్కరూ ఒక్కొక్కరి పేరు చెబుతారు. కొంతమంది అవతార పురుషుడు ఎన్ టి రామారావు పేరు, అక్కినేని నాగేశ్వరరావు పేరు, చిరంజీవి ఇలా చెప్పుకుంటా పోతారు. కానీ వారి జన్మస్థానాలు ఎక్కడ?? ఎక్కడి నుంచి వచ్చారు?? అంటే మాత్రం కామ్ గా ఉంటాం.

మనలందరినీ రోజువారీ జీవితంలో ఆనందపరుస్తూ, వారు గర్వపడే ఈ ప్రసిద్ధ జన్మస్థల వివరాలను కొన్నింటిని తెలుసుకుందామా . ఇక్కడ కొంతమంది సినిమా హీరోల పుట్టిన ప్రదేశాల గురించి వివరిస్తూ... వారు సినిమా రంగం లో ఏవిధంగా నిలదొక్కుకున్నారో ఒక లుక్ వేద్దాం పదండి!..

సమ్మర్ స్పెషల్: 3000 రూ/- ఆఫర్ తో హాలిడే బుకింగ్ చేసుకోండి ఇప్పుడే

నందమూరి తారక రామారావు- నిమ్మకూరు

నందమూరి తారక రామారావు- నిమ్మకూరు

నటునిగా, ప్రజా నాయకునిగా కోట్లమంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్న స్వర్గీయ్య నందమూరి తారక రామారావు తన నటనతో రాజకీయ సామర్ధ్యంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదిశలా వ్యాపింపజేశారు. కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు.చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాదమిక శిక్షణ పొందారు. నటన మీద ఆసక్తితో సోదరుడు త్రివిక్రమరావుతో కలసి 'నేషనల్ ఆర్ట్ దియేటర్' పేరిట సంస్థను స్థాపించి నాటకలు ప్రదర్శించేవారు. ఆక్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన యన్.టి.ఆర్ 'మనదేశం' చలనచిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. అప్పటి నుంచి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకుని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధపాత్రలలో జీవిస్తూ 320 చిత్రాలలోనటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గని కీర్తిని సంపాయించిపెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కధానాయకుడిగా నిలిచిపోయారు.
1982 లో తెలుగువాడి ఆత్మబిమానానికి జరిగిన అవమానాన్ని ప్రాతిపదికగా తీసుకుని సినీరంగం నుండి రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలోనటుడుగాను, రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శ్రీ రామరావు 1996 జనవరి 18 న గుండెపోటుతో పరమపదించారు.

Photo Courtesy: Telugunativeplanet

అక్కినేని నాగేశ్వరరావు-వెంకటరాఘవాపురం

అక్కినేని నాగేశ్వరరావు-వెంకటరాఘవాపురం

అక్కినేని అప్పటి మద్రాసు రాష్ట్రములోని కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవాపురం అనే గ్రామంలో పేద వ్యవసాయకుటుంబంలో జన్మించారు. ప్రాధమిక విద్యతోనే చదువుకు ఆటంకం ఏర్పడింది. కుటుంబ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా 9 సంవత్సరాల ప్రాయంలోనే నటనను వృత్తిగా స్వీకరించి ఎన్నో నాటకాలలో నటించారు. అప్పటి నాటకాల్లో మగవారే అడవేషాల్లో కూడా నటించేవారు. అలా తన కళారంగ ప్రారంభదశలో స్త్రీపాత్రల్లో అలరించారు. తరవాత 1941 లో 'ధర్మపత్ని' సినిమాతో అక్కినేని సినీప్రస్థానం మొదలయింది. ఆ సినిమాలో హీరో చిన్ననాటి స్నేహితుని పాత్రలో నటించారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల బలరామయ్య దృష్టిలోపడి 'సీత రామ జననం ' చిత్రంలో రాముడుగా నటించటంతో అక్కినేనికి బ్రేక్ దొరికింది. అక్కడినుంచి 69 సంవత్సరాల సుదీర్ఘ కాలంపాటు 258 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. తోలి లవర్ బాయ్ గా, రొమాంటిక్ హీరోగా, మొట్టమొదటి డ్యాన్సింగ్ హీరోగా అక్కినేనిది తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం. జానపద, పౌరాణిక చిత్రాలలో నటించినప్పటికీ సాంఘిక, కుటుంబకధా చిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.
అక్కినేని నటజీవితంలో అజరామరమైన చిత్రాలు ఎన్నో తెనాలి రామకృష్ణ, కాళిదాసు, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కధ, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘసందేశం వాటిలో మచ్చుకకు కొన్ని. అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు సినీపరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావటంలో కీలకపాత్ర పోషించారు అక్కినేని.

Photo Courtesy: telugu native planet

శోభన్ బాబు-నందిగామ

శోభన్ బాబు-నందిగామ

ఆంధ్రుల అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న సోగ్గాడు శోభన్ బాబు కృష్ణాజిల్లా నందిగామలో ఓ సాదారణ రైతు కుటుంబంలో జన్మించారు. . దైవబలం(1959) సినిమాతో శోభన్ బాబు సినీ రంగప్రవేశం చేసారు. కానీ 'భక్త శబరి' తొలుత విడుదల అయ్యింది. తరవాత చాలా సినిమాలలో చిన్నపాత్రలు వేస్తూ వచ్చారు. 1965 లో వచ్చిన 'వీరాభిమన్యు' తో సోలో హీరో గా తోలివిజయం సాదించారు, కానీ పరిస్థితిలో ఏ మార్పు లేదు, దాంతో కుటుంబ పోషణ కోసం మరికొంతకాలం చిన్న వేషాలు వేసారు. 1969 లో వచ్చిన 'మనుషులు మారాలి' సినిమా 25 వారలు దిగ్విజయంగా నడవడంతో శోభన్ బాబు హీరోగా ష్టిరపడ్డారు. అక్కడినుంచి 1996 వరకు 226 చిత్రాలలో నటించారు. తోలి తెలుగు కుటుంబ కధానాయకుడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు హిందీ నటుడు దిలీప్ కుమార్ తరవాత వరసగా మూడుసార్లు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకుని రికార్డు సృష్టించారు. గ్లామర్ కు పెట్టింది పేరు అయిన శోభన్ బాబు నుదిటి మీద స్టైల్ గా తిప్పే రింగు 'శోభన్ బాబు రింగ్' గా ఇప్పటికీ ఓ ఫ్యాషన్ గా వెలుగొందుతుంది.
శోభన్ బాబు తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి మురళి మోహన్ లాంటి ఎందరో నటులకు ఆదర్శంగా నిలిచారు. నట జీవితానికి స్వస్తి పలికిన తరవాత శోభన్ బాబు తన కుటుంబ సభ్యులతో ఆనందమైన జీవితాన్ని గడుపుతూ 2008 మార్చ్ 20 న పరమపదించారు.

Photo Courtesy: telugu native planet

కృష్ణంరాజు-మొగల్తురు

కృష్ణంరాజు-మొగల్తురు

ఎర్రబారిన కళ్ళతో, వైవిధ్యమైన ఆహార్యంతో తెలుగు ప్రేక్షకులమదిలో రెబల్ స్టార్ గా నిలిచిపోయిన కృష్ణంరాజు తూర్పు గోదావరి జిల్లా మొగల్తురులో జన్మించారు. 1966 లో దర్శకుడు ప్రత్యగాత్మ నిర్దేసికత్వంలో రూపుదిద్దుకున్న 'చిలకా గోరింక' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. తోలినాళ్ళలో ప్రతినాయక పాత్రల్లో నటించిన, తరవాత హేమాంబరధరరావు 'వింత దంపతులు'లో హీరోపాత్రలో నటించారు. ఆ తరవాత దాదాపు 188 చిత్రాలలో వివిధ పాత్రలలో నటించారు. 1970, 1980 దశకాలలో స్టార్ హీరోలలో ఒకరిగా వెలుగొందారు.
గోపికృష్ణ బ్యానర్ స్థాపించి తోలి ప్రయత్నంగా 'కృష్ణ వేణి' అనే యాంటి సెంటిమెంట్ సినిమా తీసి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. భక్త కన్నప్ప, అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు మొదలగు చిత్రాలు ఆయనకు హీరోగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చి పెట్టాయి. తరవాతి కాలంలో రాజకీయ రంగప్రవేశం చేసి 1999 లో బి.జే.పి. తరుపున యం.పి గా గెలిచి కేంద్ర సహాయమంత్రిగా పనిచేసారు.

Photo Courtesy: telugu native planet

కృష్ణ-బుర్రుపాలెం

కృష్ణ-బుర్రుపాలెం

నటశేఖరునిగా కీర్తింపబడ్డ సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపానగల బుర్రుపాలెం అనే గ్రామంలోమధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే నటనమీద ఆసక్తి కనబరచిన కృష్ణ తరవాత సినీ రంగప్రవేశం చేసి 'పదండి ముందుకు', 'కులగోత్రాలు', 'పరువు-ప్రతిష్ట' వంటి చిత్రాల్లో నటించిన గుర్తింపు రాలేదు. ఆ సమయంలో ఆదుర్తి సుబ్బారావు గారు కొత్తవాళ్ళతో నిర్మిస్తున్న 'తేనెమనసులు' ప్రకటన చూసి ప్రయత్నించి, ఎంతో పోటీని తట్టుకుని సినిమాలో ముఖ్య భూమికను పోషించారు. ఆ సినిమా హిట్అవటంతో ఆదుర్తి అదే తారాగణంతో 'కన్నెమనసులు' ప్రారంబించగా, అదే సమయంలో కృష్ణ కు డుండి 'గూడచారి 116 ' లో అవకాశం దక్కింది. 'కన్నె మనసులు' పారాజయంపాలైనా గూడచారి 116 విజయంతో యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు. ఆ తరవాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దాదాపు 350 చిత్రాలలో నటించారు. హీరోగా ఒక సంవత్సర కాలంలో అత్యదిక సినిమాలు విడుదల అయిన రికార్డు ఇప్పటికి కృష్ణ పేరిటే ఉండటం విశేషం. నిర్మాతల హీరోగా కీర్తిగడించిన కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమకు ఎక్కువ 'తోలి' లు అందించిన వ్యక్తిగా నిలిచిపోయారు. తోలి సిక్రెట్ ఏజెంట్, తోలి కౌ బాయ్, తోలి సినిమా స్కోప్, తోలి 70 ఎమ్.ఎమ్. ఇలా అన్ని కృష్ణపేరిటే ఉండటం విశేషం.
కృష్ణ తదుపరి కాలంలో పద్మాలయ స్టూడియోస్ నిర్మించి మోసగాళ్ళకు మోసగాడు, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలతోపాటు పలు హిందీ సినిమాలను కూడా నిర్మించారు. దర్శకుడిగా సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం, నాగాస్త్రం వంటి చిత్రాలను రూపొందించారు. దాదాపు 350 చిత్రాలలో నటించిన కృష్ణ 100 వ చిత్రం ' అల్లూరి సీతారామరాజు', 200 వ చిత్రం 'ఈనాడు', 300 వ చిత్రం తెలుగు వీర లేవరా.

Photo Courtesy: telugunativeplanet

చిరంజీవి-మొగల్తూర్

చిరంజీవి-మొగల్తూర్

అశేష ఆంధ్ర సినిమా అభిమానుల గుండెల్లో మెగాస్టార్ గా కొలువుదీరిన చిరంజీవి జీవనయాత్ర పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు నుంచి మొదలైంది.కాలేజీ రోజుల్లో నటనమీద ఏర్పడ్డ మమకారాన్ని నిజంచేసుకోవడానికి మద్రాసులో ఫిలింఇన్స్టిట్యుట్ లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నారు. 1978 లో శిక్షణాకాలం పూర్తవుతున్న సమయంలో 'పునాది రాళ్ళు' సినిమాలో నటించే ఆవకాశం రావటంతో చిరంజీవి సినీ ప్రస్థానం మొదలయింది. 1983 లో విడుదల అయిన 'ఖైది ' తెలుగు సినిమా పరిశ్రమకు ఓ పెద్ద స్టార్ నీ ప్రసాదించింది. అదిరిపోయే డాన్సు లుతో , ఫైట్ లతో వచ్చిన మాస్ ఫాలోయింగ్ తో సుప్రీంహీరోగా తరవాత మెగా స్టార్ గా కోటానుకోట్ల అభిమానులను సంపాయించుకుని స్టార్ ఇమేజ్ కు కొత్త నిర్వచనం చెప్పారు అయన. చిరంజీవి సినీజీవితం 'పునాది రాళ్ళు'తో మొదలై ఖైది, అభిలాష, చాలంజ్, మంచిదొంగ, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర వంటి సూపర్ డూపర్ హిట్ లతో ఇప్పటి వరుకు 149 చిత్రాలకు పని చేసారు. గ్యాంగ్ లీడర్ హిట్ తరవాత దేశంలోని పెద్ద న్యూస్ మ్యాగ్ జైన ది వీక్ చిరంజీవిని 'సరికొత్త మనీమిషన్ ' గా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించి తోలి ప్రయత్నంగా 'రుద్రవీణ' అనే సామజిక స్పృహ కలిగిన సినిమాను నిర్మించి జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా సామాన్య ప్రజలకు సేవలను అందిస్తున్నారు.

Photo Courtesy: telugunativeplanet

రాజేంద్ర ప్రసాద్-నిమ్మకూరు

రాజేంద్ర ప్రసాద్-నిమ్మకూరు

నవ్వుల నాయకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాయించుకుని కామెడీ హీరోగా తెలుగు సినిమా వనంలో నవ్వులు పూయించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కృష్ణాజిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. ప్రాధమిక విద్య తరవాత గూడూరు పాలటెక్నిక్ కాలేజీ లో సిరామిక్ ఇంజినీరింగ్ లో డిప్లొమా సంపాయించారు. తరవాత తన ఊరునుండి వెళ్ళి గొప్పనటునిగా పేరుపొందిన యన్.టి.రామారావు గారి స్పూర్తితో నటన మీద ఆసక్తి పెంచుకున్న రాజేంద్రప్రసాద్ చెన్నై చేరుకున్నారు. అవకాశాలవేటలో ఆకలి, అవమానాలతో పోరాటం చేసారు. ఆ క్రమంలోనే కొన్నాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసారు. 1977 లో బాపు దర్శకత్వంలో వచ్చిన 'స్నేహం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రతినాయకుడిగా, క్యారక్టర్ నటుడిగా నట ప్రస్థానం మొదలు పెట్టినా 1985 లో వంశీచేతిలో రూపుదిద్దుకున్న 'లేడిస్ టైలర్' తో కామెడీ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నారు. తరవాత 1987లో జ్యంద్యాల దర్సకత్వంలో వచ్చిన 'ఆహా నా పెళ్ళంట' .. చిత్రంతో హాస్య కధానాయకుడిగా స్థిరపడ్డారు. వినోదత్మాక చిత్రాలను రూపొందించే వంశీ, జంద్యాల, ఇ.వి.వి.సత్యనారాయణ, యస్.వి.కృష్ణా రెడ్డి వంటి దర్శకులకు ఆస్థాన కధనాయకుడిగా వెలుగొందారు. కేవలం హాస్యరసచిత్రాలలోనే కాకుండా ఎర్రమందారం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సందేసాత్మక చిత్రాలలోకుడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 33 సంవత్సరాల సినీప్రయాణంలో రాజేంద్ర ప్రసాద్ దాదాపు 180 చిత్రాలకు పని చేసారు.
1994 లో విజయ చాముండేశ్వరి ఫిలింస్ బ్యానర్ స్థాపించి సింగీతం శ్రీనివాస్ దర్సకత్వంలో 'మేడం' చిత్రాన్ని నిర్మించారు. అదే బ్యానర్ లో 1996 లో నిర్మించిన రాంబంటు పరాజయం పాలవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కున్నారు. నిర్మాతగా నష్టపోయిన నటుడిగా తన ప్రతిభతో తిరిగి తన ఉనికిని చాటి తెలుగు సిని చరిత్రలో తనస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

Photo Courtesy: Telugunativeplanet

అక్కినేని నాగార్జున-చెన్నై

అక్కినేని నాగార్జున-చెన్నై

అక్కినేని నాగేశ్వర రావు నటవారసునిగా తెలుగు సినిమాలోకి ప్రవేశించిన నాగార్జున మద్రాస్ లో జన్మించారు. 1986 లో 'విక్రం' సినిమాతో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాతో నటునిగా మంచి మార్కులు పడిన తరవాత చాలాకాలం సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో 1988 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ఆఖరి పోరాటం' ఘన విజయంతో నాగార్జున హీరోగా స్థిరపడ్డారు. ఇక 1989 లో వచ్చిన మణిరత్నం 'గీతాంజలి, రామ్ గోపాల్ వర్మ 'శివ' వరస విజయాలతో స్టార్ ఇమేజ్ సంపాయించుకున్నారు. గీతాంజలి తో లవర్ బాయ్ గా ఆకటుకున్న నాగార్జున, శివ తో తెలుగు సినిమా గతిని మార్చి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్ .. వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఆకర్షించారు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందారు. ఆలా అటు క్లాసు ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినిమా మూడోతరం టాప్ హీరోలుగా ఉన్న నలుగురులో ఒకరిగా నిలిచారు. తెలుగు సినిమా గురించి తెలిసిన ప్రతి హీరోయిన్ నాగార్జున తో ఒక్కసారి అయిన నటించాలి అని కలలు కంటుంది అని అనటంలో అతిశయోక్తి లేదు. మంచి నటుడిగానే కాకుండా ఉత్తమ అభిరుచిగల నిర్మాతగా కూడా నాగార్జున పేరు తెచ్చుకున్నారు. ఎ.ఎన్.ఆర్ నెలకొల్పిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్వహణను ఆయన చేపట్టిన తరవాత నాగార్జున మంచి చిత్రాలను రూపొందిస్తూ ఆ బాద్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. తను సొంతంగా గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ స్థాపించి ఎంతోమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను వెండితెర, బుల్లితెరలకు పరిచయం చేసారు. రామ్ గోపాల్ వర్మ, వై.వి.యస్ చౌదరి వంటి దర్శకులకు తోలి అవకాశం ఇచ్చి కొత్త దానాన్ని ప్రోత్సహించారు. సినీరంగంతో పాటు వ్యాపారరంగంలోనూ నాగార్జున తనదైన ముద్రవేసారు. హైదరాబాద్ లోను, దుబాయ్ లోను గొలుసుకట్టు రెస్టారెంట్ లు, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టుబడులు పెట్టి తెలివి గల వ్యాపారవేత్తగా నిరూపించుకున్నారు.

Photo Courtesy: Telugunativeplanet

విక్టరీ వెంకటేష్ - కారంచేడు

విక్టరీ వెంకటేష్ - కారంచేడు

శతచిత్రాల నిర్మాత మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు వారసునిగా తెలుగు సినిమాకు పరిచయమయి, ఆనతికాలం లోనే 'విక్టరీ' ని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ ప్రకాశంజిల్లా లోని కారంచేడులో జన్మించారు. చదువు అయిపోయి ఇండియా వచ్చిన వెంకి నాన్నగారితో కలసి సినిమా నిర్మాణ పనులు చూసుకోవాలి అనుకుంటూ ఉండగా అనూహ్య పరిణామాలతో హీరోగా మారారు. అప్పుడు రామానాయుడుగారు రాఘవేంద్రరావు, హీరో కృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేసారు కానీ ఆఖరి నిమిషంలో కృష్ణ డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమా చేయలేను అన్నారు. రాఘవేంద్రరావు డేట్ లు వదులు కోవటం ఇష్టంలేని రామానాయుడి గారు వెంకటేష్ తో సినిమా మొదలు పెట్టారు. అదే 1986లో వచ్చిన కలియుగపాండవులు. ఆ సినిమా ఘనవిజయంతో వెంకటేష్ పేరు ఆంద్రదేశమంతటా మారు మ్రోగటమే కాకుండా తోలిచిత్రంతోనే నంది అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించారు. ఇక అక్కడినుండి 25 సంవత్సరాల కాలంలో 63 చిత్రాలలోనటించారు. నటించిన మొత్తం చిత్రాలలో ఎక్కువ శాతం విజయాలు ఉన్న తెలుగు హీరోగా వెంకి అభినందనీయుడు. అందుకనే 'విక్టరీ' అనేది అయన ఇంటిపేరు అయ్యింది. కెరీర్ తోలినాళ్ళలో యువతను ఆకర్షించిన వెంకి బొబ్బిలిరాజ తో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రేమించుకుందాం..రా..!, పెళ్ళిచేసుకుందాం, కలిసుందాం..రా..! వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం గెలుచుకుని తెలుగు సినిమా మూడో తరం టాప్ నలుగురు హీరోలలో ఒకరిగా నిలిచారు.
వెంకటేష్ తెలుగు లోనే కాకుండా 'ఆనారి', 'తక్ దీర్ వాలా' వంటి చిత్రాలతో హిందీలో కూడా తన ఉనికిని చాటారు. సెంటిమెంట్, యాక్షన్ లను వైవిద్యంగా ప్రదర్శించటం లో వెంకటేష్ ది ఒక ప్రతేక శైలి. తన సమకాలిన నటులలో హాస్యాన్ని సమర్ధవంతంగా పండించటంలో వెంకి నెంబర్ ఒన్. వెంకి ప్రదర్శించిన ఉత్తమ నటనకు గాను 7 నందులు, 5 ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. నటన కాకుండా వెంకి క్రికెట్ అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ఆద్యాత్మికచింతన కూడా ఎక్కువే వెంకికి, రమణ మహరిషి సూచించిన ప్రభోదాలను అనుసరిస్తూ ఉంటారు.

Photo Courtesy: Telugunativeplanet

నందమూరి బాలకృష్ణ- మద్రాస్

నందమూరి బాలకృష్ణ- మద్రాస్

నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు అబిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి గారి దర్శకత్వంలో 1974 లో వచ్చిన 'తాతమ్మకల' చిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. తరవాత పది సంవత్సరాల కాలంలో చాలావరుకు తన తండ్రిగారి దర్శకత్వం వహించిన 'అన్నదమ్ముల అనుభందం', 'దానవీర సూరకర్ణ' వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు. 1984 లో మంగమ్మగారి మనవడు సినిమా ఘనవిజయంతో సోలోహీరోగా స్థిరపడ్డారు. తరవాత కధానాయకుడు, ముద్దులమామయ్య, లారిడ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సూపర్ హిట్ లతో తెలుగు సిని పరిశ్రమ మూడో తరం టాప్ నలుగురు కధనాయకులలో ఒక్కరిగా ఉన్నారు. యన్.టి.ఆర్ తరవాత పౌరాణిక, జానపద చిత్రాలలో ఆకట్టుకునేవిధంగా నటించగల సత్తా బాలయ్యకే ఉంది అని 'బైరవ ద్వీపం', 'శ్రీకృష్ణార్జున విజయం' వంటి చిత్రాలతో నిరూపించాడు.
పవర్ ఫుల్ డైలాగులు చెప్పడంలోను, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలో బాలయ్యకు మించినవాళ్ళు ఈతరంలో లేరు అనటం లో అతిశయోక్తి లేదు. బాలయ్య కు ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని పరాజయాలు ఉన్నాయి. కానీ ప్రతి పరాజయాల పరంపరను ఓ బ్లాక్ బాస్టర్ హిట్ తో తుడిచేయటం బాలయ్య అలవాటు. ఆ కోవలోకే వస్తాయి ముద్దుల కృష్ణయ్య, లారి డ్రైవర్, సమరసింహా రెడ్డి, సింహ సినిమాలు.ఎప్పటికైనా గోనగన్నారెడ్డి, చంగీజ్ ఖాన్ చిత్రాలు రుపొందించాలన్నది బాలయ్యకల.

Photo Courtesy: Telugunativeplanet

జగపతి బాబు -విజయవాడ

జగపతి బాబు -విజయవాడ

జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేసి ఫ్యామిలీ స్టార్ గా శోభన్ బాబు తరవాత మహిళా ప్రేక్షకుల అభిమానం సంపాయించుకున్న జగపతిబాబు విజయవాడలో పుట్టి మద్రాస్ లో పెరిగారు. రాజేంద్రప్రసాద్ గారు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989 లో 'సింహస్వప్నం' సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేసారు. తోలి సినిమాలోనే డబుల్ రోల్ లో చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ తరవాత చేసిన చాలాచిత్రాలు ప్లాపులుగానే నిలిచాయి కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతిబాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి 'గాయం' హిట్ తో హీరోగా స్థిరపడ్డాడు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం దాసోహం అయ్యారు.
1994 లో యస్.వి.కృష్ణరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'శుభలగ్నం' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో పనిచేసాడు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరుతెచ్చుకున్న జగపతిబాబు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాయించుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'అంతఃపురం' సినిమాలో చేసిన సారాయి వీరాజు పాత్రలో జీవించి ప్రేక్షకులను మైమరపించారు. ఆ తరవాత సముద్రం, మనోహరం వంటి చిత్రాలతో ప్రయోగాలకు చిరునామాగా మారాడు.పాత్ర ఎటువంటిదైనా తనదైన నటనతో రక్తికట్టించగల నటుడిగా ముద్రవేయించుకున్న జగపతిబాబు ఆవకాశాలను సృష్టించుకోవడంలో నేటి యువతరం హీరోలతో పోటిపడుతున్నారు.

Photo Courtesy: Telugunativeplanet

శ్రీకాంత్-విజయవాడ

శ్రీకాంత్-విజయవాడ

ఎవరి అండదండలు లేకుండా తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టి, కొద్ది సమయంలోనే శత చిత్రాలలో నటించిన హీరో శ్రీకాంత్ జన్మస్థలం విజయవాడ. పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది, చదువుకుంది కర్ణాటకలో. కర్నాటకలోని గంగావతి ప్రాంతంలో స్థిరపడిన చిన్న రైతు కుటుంబం శ్రీకాంత్ వాళ్ళది. ఆవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఉషాకిరణ్ మూవీ నిర్మిస్తున్న చిత్రంలో 15 మంది కొత్త వాళ్ళు కావాలని అని తెలిసి వెళ్తే దర్శకుడు మోహన్ గాంధీ శ్రీకాంత్ ను ఎంపిక చేసాడు. ఆ విదంగా 'పీపుల్స్ ఎన్ కౌంటర్ '(1991) సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. వెంటనే 'మధురానగరిలో' లో హీరోగా ఆవకాశం రావటంతో ఆ తరవాత కూడా హీరో అవకాశాలువస్తాయేమో అని ఎదురు చూసాడు కాని లాభం లేక పోయింది. అదే సమయంలో ఇ.వి.వి. సత్యనారాయణ విలన్ గా నటించమని కోరడంతో 'వారసుడు' సినిమాలో నటించాడు. ఆ తరవాత దాదాపు 13 సినిమాలలో విలన్ గా నటించాడు.
కాలం గడిచిపోతున్నసమయంలో తమ్మారెడ్డి భరద్వాజ 'ఒన్ బై టూ' (1993)చిత్రంలో హీరోగా ఆవకాశం ఇచ్చారు. తరవాత ఆయనే 'దొంగ రాస్కెల్' రూపొందించాడు. శ్రీకాంత్ ఫై విశ్వాసం ఉంచిన ఇ.వి.వి 'ఆమె '(1994) చిత్రం లో మంచి పాత్ర ఇచ్చారు. సినిమా విజయవంతం అయ్యి శ్రీకాంత్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. శ్రీకాంత్ లోని ప్రతిభ గుర్తించిన రామానాయుడు గారు శ్రీకాంత్ సోలో హీరోగా 'తాజ్ మహల్ '(1995) నిర్మించారు.తాజ్ మహల్ విజయంతో రాఘవేంద్ర రావు దృష్టిలో పడ్డ శ్రీకాంత్ కు 'పెళ్ళిసందడి'(1996) లో ఆవకాశం వచ్చింది. ఆ సినిమా ఘనవిజయం సాదించడం తో హీరోగా స్థిరపడ్డాడు. ఇక అక్కడి నుండి వరసగా సినిమాలు చేసుకుంటూ 100 చిత్రాలు పూర్తిచేసాడు. 'వినోదం', ఎగిరే పావురమా..., వంటి చిత్రాలతో యస్వీ కృష్ణ రెడ్డి , తాళి , కన్యాదానం వంటి చిత్రాలతో ఇ.వి.వి శ్రీకాంత్ తో ఖాళీ లేకుండా సినిమాలు చేపించారు. వారిద్దరితోనే 23 చిత్రాలు చేయడం విశేషం.హీరో గానే కాకుండా ఆ నటనకు ఆవకాశం ఉన్న సహాయనటుడి పాత్రల్లో కూడా ఆలరించాడు. ఖడ్గం, 'ఆపరేషన్ దుర్యోదన' వంటి చిత్రాలలో విలక్షణ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో 'మహాత్మ' చిత్రంతో 100 చిత్రాల మైలురాయి దాటినా శ్రీకాంత్ ఇప్పటికి కూడా ఎప్పుడూ చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Photo Courtesy: Telugunativeplanet

పవన్ కళ్యాణ్-చీరాల

పవన్ కళ్యాణ్-చీరాల

మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగేట్రం చేసి అనతికాలంలోనే పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాయించుకున్న పవన్ కళ్యాణ్ చీరాలలో జన్మించారు. పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయిన ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టాడు. ఇంటర్ మీడియట్ తో చదువుకు స్వస్తిచెప్పిన కళ్యాణ్ బాబు, తరవాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నాడు. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని 1996 లో 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో పవన్ చేసిన సాహసాలకు మంచి గుర్తింపు వచ్చింది. తరవాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు హీరో గా నిలబెట్టాయి. 1999 లో వచ్చిన 'తొలిప్రేమ' లో బాలు గా యువతరాన్ని ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇప్పటి వరకు పవన్ చేసిన 15 సినిమాలతోనే నాలుగోతరం అగ్ర హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్ తో, వెరైటి సంభాషణలతో యూత్ ని కట్టిపడేసాడు. సామాన్య ప్రజలే కాకుండా వెంకటేష్, మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ ని ఇష్ట పడటానికి కారణం కూడా అవే. పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా ను అమితంగా ఇష్ట పడే పవన్ ఆయన స్పూర్తి తో దర్శకుడుగా 'జానీ' చిత్రాన్ని రూపొందించాడు.

Photo Courtesy: Telugunativeplanet

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X