Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాకు దగ్గరలో 600 దీవులు !!

ఇండియాకు దగ్గరలో 600 దీవులు !!

అండమాన్ మరియు నికోబార్ దీవులు బంగాళాఖాత సముద్రంలో కలవు. ఇవి మొత్తంగా 600 దీవులు. వీటిలో చాలా వరకు మ్యాపు లలో కనపడవు. ఈ దీవుల గురించిన ప్రధాన అంశాలు కొన్ని వివరిస్తున్నాం. పరిశీలించండి. నగర బిజీ జీవిత

By Venkatakarunasri

అండమాన్ మరియు నికోబార్ దీవులు బంగాళాఖాత సముద్రంలో కలవు. ఇవి మొత్తంగా 600 దీవులు. వీటిలో చాలా వరకు మ్యాపు లలో కనపడవు. ఈ దీవుల గురించిన ప్రధాన అంశాలు కొన్ని వివరిస్తున్నాం. పరిశీలించండి.

నగర బిజీ జీవితంతో అలసి పోయారా ? ప్రశాంత వాతావరణం లో కొద్ది రోజులు ఆనందంగా గడపాలని నిర్నయిన్చారా ? ఈ పరిస్థితిలో కల మీకు అద్భుత ప్రశాంతత ఇచ్చే అండమాన్ దీవులు చక్కని పరిష్కారం కాగలదు.

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ దీవులు ఎలా చేరాలి ?

దేశంలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ప్రధాన నగరాలైన ఢిల్లీ, చెన్నై, కోల్కత్త మరియు భువనేశ్వర్ ల నుండి పోర్ట్ బ్లెర్ కు విమాన సౌకర్యం కలదు. అండమాన్ మరియు నికోబార్ దీవులకు పోర్ట్ బ్లెర్ రాజధాని. ఈ దీవులకు వెళ్ళాలన్నా, బయటకు రావాలన్నా ఇక్కడ నుండి ప్రయాణించ వలసినదే. 2004 లో వచ్చిన సునామీ తుఫాను కారణంగా ఈ దీవులకు నష్టం వాటిల్లింది. అయినప్పటికీ మరోమారు ఇవి పూర్వపు శోభను సంతరించుకొంటున్నాయి.

Photo Courtesy: Sandra Schleter

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

హావ్ లాక్ ద్వీపం అండమాన్ మరియు నికోబార్ దీవులలో హావ్ లాక్ ద్వీపం కు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడి బీచ్ లు చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంటాయి. పర్యాటకులు, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి నీటి క్రీడలు కూడా ఇక్కడ ఆనందించ వచ్చు.

Photo Courtesy: Satyam555

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

రూట్ ల్యాండ్ ఐలాండ్ రూట్ లాండ్ దీవి జనాలు అధికంగా లేక ప్రశాంతంగా సహజ అందాలతో కూడి వుంటుంది. ఇక్కడ సముద్ర తీర అడవులు, పగడపు దీవులు ఆకలవు. పర్యావరణ పర్యాటకులకు ఇది ఎంతో ఆకర్షణీయ ప్రదేశం.

Photo Courtesy: scheherezade

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

నీల్ ద్వీపం పొడవైన సముద్ర బీచ్ లు కల నీల్ ద్వీపం మొదటి ఆకర్షనలోనే మీకు అద్భుతంగా గోచరిస్తుంది. నీరెండలు కల బీచ్ లలో పూర్తి విశ్రాంతి తీసుకోవచ్చు. లేదా ఇక్కడ నిర్వహించే స్నార్కెలింగ్, స్విమ్మింగ్, సి వాకింగ్, వంటి నీటి క్రీడలలో ఆనందించవచ్చు.

Photo Courtesy: Dastra

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

వందూర్ ఇది ఒక సోమరుల స్వర్గం. చక్కని బీచ్, ఆహ్లాదకర వాతావరణం. కొద్దిపాటి సాహసికులు అయితే, ఇక్కడ కల మహాత్మా గాంధి మెరైన్ నేషనల్ పార్క్ కూడా సందర్శించవచ్చు.

Photo Courtesy: Rajarshi777

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

బారాతంగ్ ద్వీపం ఈ దీవికి అక్కడ నిర్వహించే గైడెడ్ టూర్ లలో వెళ్ళటం సూచించ దగినది. బారాతంగ్ ఒక అగ్ని పర్వత ప్రదేశం. ఇక్కడ అనేక సున్నపు రాతి గుహలు, మాన్ గ్రోవ్ ప్రదేశాలు చూడవచ్చు. అనాగరికులైన జార్వా తెగ ప్రజలు ఇక్కడ నివసిస్తారు. వీరితో వ్యవహరించటం చాలా కష్టం. ఇక్కడ కల ఆకర్షణీయ పేరేట్ దీవి కూడా తప్పక చూడదగిన ఆకర్షనలలో ఒకటి. ఇది చూడాలంటే, రాత్రి వసతి తీసుకొనవలసి వస్తుంది.

Photo Courtesy: Dan Heap

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

బారెన్ ద్వీపం పేరుకి తగినట్లు ఈ ద్వీపంలో మానవ సంచారం వుండదు. పక్షులు, ఎలుకలు వంటివి మాత్రమే నివస్తాయి. ఈ ద్వీపం లో కల అగ్ని పర్వతాలు ఎపుడూ పేలుతూనే వుంటాయి.

Photo Courtesy: Satyam555

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

లాంగ్ ఐలాండ్ ఈ ద్వీప ప్రయాణం ఒక రాబిన్సన్ క్రూసో సినిమా వలే వుంటుంది. నివాసితులు అనాగరిక ప్రజలు. ఇక్కడకు మీరు వచ్చేటపుడు, మీ ఆహారం, నీరు వంటివి తెచ్చుకొని ఆనందించటం మంచిది.

Photo Courtesy: Derek Keats

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

లిటిల్ అండమాన్ 2004 సంవత్సరంలో సునామి తుఫాను వచ్చే వరకు ఇది ఒక సర్ఫింగ్ కేంద్రంగా వుండేది. ఈ ద్వీపంలో కొన్ని బీచ్ లు, జలపాతాలు, కలవు. స్థానికులు స్నేహపూర్వకంగానే వుంటారు.

Photo Courtesy: Sankara Subramanian

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు జాలీ బాయ్ ద్వీపం వందూర్ నుండి ఒక జెట్టి లో ప్రయాణించి జాలీ బాయ్ ద్వీపం చేరుకోవచ్చు. ఇక్కడ మీరు స్నార్కెలింగ్, సి వాకింగ్ వంటి క్రీడలు ఆచరించవచ్చు. చిన్న బీచ్, స్వచ్చమైన నీరు , వివిధ రకాల సముద్ర ప్రాణులు, ఈ ప్రాంతం కు అద్భుత అందాలు తెచ్చి పెట్టాయి.

Photo Courtesy: Rajarshi777

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అంతులేని ఆనందాలు ఇక్కడి ద్వీపాలలో ప్రధానంగా అందరూ బీచ్ విహారం సూర్య రశ్మి స్నానాలు చేస్తూ పూర్తి విశ్రాంతి తీసుకుంటారు. మరింత ఉత్సాహవంతులు స్నార్కెలింగ్ , స్కూబా , సి వాకింగ్, సర్ఫింగ్ వంటి నీటి క్రీడలు ఆచరిస్తారు.

Photo Courtesy: Live Zakynthos

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ అందాలు నికోబార్ ఆకర్షణలు

అండమాన్ ఆహారాలు ఈ ప్రదేశంలో మీరు ఎపుడు, ఏమి తిన్నాలన్నా దొరికేవి సముద్రపు ఆహారాలు. వండుకొని, వేయించుకొని, ఉడక బెట్టి ఎలా తిన్నప్పటికీ అవి సముద్రపు ఆహారాలే. ఎన్నో రకాల చేపలు అతి రుచికరమైనవి దొరుకుతాయి.అయితే , ఇక్కడ కొన్ని రెస్టారెంట్ లలో భారతీయ వంటకాలు కూడా లభిస్తాయి.

Photo Courtesy: Jpatokal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X