Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో అత్యధికులు సందర్శించే పర్యాటక ప్రదేశాలు !

ఇండియాలో అత్యధికులు సందర్శించే పర్యాటక ప్రదేశాలు !

By Mohammad

ఇండియాలో చూసిరావటానికి చాలానే ప్రదేశాలు ఉన్నాయి. అందులో కొందరికి ఆ ప్రదేశాలు నచ్చవచ్చు మరికొందరికి నచ్చక పోవచ్చు. కానీ, పర్యాటకులు కొన్ని ప్రదేశాలను ఎక్కువగా చూసివస్తుంటారు. అలాంటి ప్రదేశాలే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది.

ఇండియాలో అత్యధిక పర్యాటకులు సందర్శించే పర్యాటక స్థలాలలో టాప్ 10 పర్యాటక స్థలాల గురించి చెప్పుతున్నదే ప్రస్తుత ఈ వ్యాసం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రదేశాలని అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపరచాలని, అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటిని పరిశుభ్ర పరచాలని భావిస్తున్నది. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏంటో ఒక లుక్ వేద్దాం పదండి.

తిరుపతి

తిరుపతి

ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి ఎంత పెద్ద పుణ్య క్షేత్రంలో అందరికీ తెలుసు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుండి తరలి వస్తుంటారు. భారతదేశంలో ఎక్కువ మంది యాత్రికులు సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. అలాంటి ఈ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కేంద్రం భావిస్తున్నది.

చిత్ర కృప : sagarkumarpanda

తాజ్ మహల్

తాజ్ మహల్

తాజ్ మహల్ ఆగ్రా లో కలదు. ఇది ప్రపంచములోని ఏడు వింతల్లో ఒకటి. ప్రేమకు గుర్తుగా నిలిచిన ఈ అద్భుత కట్టడాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రదేశంలో మొక్కలను నాటి, పరిమళించే పచ్చదనానికి కృషి చేయాలని కేంద్రం భావిస్తున్నది.

చిత్ర కృప : Christopher John SSF

మనికర్ణికా ఘాట్

మనికర్ణికా ఘాట్

మణికర్ణికా ఘాట్ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో కలదు. ఈ ఘాట్ నే డెత్ టూరిజం అని కూడా అంటారు. అనేక మంది సందర్శకుల అంత్యక్రియలను ఇక్కడ బహిరంగంగా వెలిగించి నిప్పంటిస్తుంటారు. గంగా నది ఒడ్డున ఈ ప్రదేశాన్ని 'గంగా నది ప్రక్షాళన' కార్యక్రమంలో లో భాగంగా పరిశుభ్రపరచాలని కేంద్రం ఆలోచిస్తున్నది.

చిత్ర కృప : Dennis Jarvis

వైష్ణో దేవి ఆలయం

వైష్ణో దేవి ఆలయం

వైష్ణో దేవి ఆలయం హిందువుల పవిత్ర స్థలం. జమ్మూ నుండి 46 కి. మీ ల దూరంలో ఉన్న కాట్రా లోని త్రికూట హిల్స్ పై సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తున కలదు. ఏటా లక్షల సంఖ్యలో దర్శించే ఈ ఆలయాన్ని కూడా శుభ్రపరచాలి కేంద్రం ఆలోచన. తిరుపతి వెంకన్న స్వామి తర్వాత దేశంలో అత్యధికులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

చిత్ర కృప : www.maavaishnodevi.org

మీనాక్షి ఆలయం

మీనాక్షి ఆలయం

ఆలయాల భూమి గా పిలువబడే తమిళనాట మధురై ఆలయం ఉన్నది. 12 గేట్లు, 6 హెక్టార్లలో విస్తరించిన ఈ ఆలయం అద్భుత శిల్ప సంపదకు తార్కాణం. ఏటా అధిక సంఖ్యలో మీనాక్షి అమ్మవారికి యాత్రికులు సందర్శిస్తుంటారు. ఆలయ పరిసరాలని అందంగా తీర్చిదిద్ధేందుకై ప్రభుత్వం భావిస్తున్నది.

చిత్ర కృప : Kamal Baba

ఛత్రపతి శివాజీ టెర్మినల్

ఛత్రపతి శివాజీ టెర్మినల్

శివాజీ టెర్మినల్ ముంబై నగరంలో కలదు. ఇది వరకు దీనిని విక్టోరియా టెర్మినల్ అని పిలిచేవారు. ఈ ప్రదేశం వాణిజ్య కేంద్రం. సంవత్సరం పొడవునా ముంబై వచ్చే యాత్రికులు టెర్మినల్ ను తప్పక సందర్శిస్తారు. పురాత పుస్తకాలు, చారిత్రక వస్తువులు, దుస్తులు, కంప్యూటర్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మే దుకాణాలు ఇక్కడ అధికం. ఈ ప్రదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని కేంద్రం ఆలోచన.

చిత్ర కృప : Arian Zwegers

దర్గా షరీఫ్

దర్గా షరీఫ్

దర్గా షరీఫ్ అజ్మీర్ లో కలదు మరియు ఈ స్థలం మహమ్మదీయులకు పవిత్రమైనది. సూఫీ సన్యాసి ఖాజా మొయినుద్దీన్ చిస్తీ నివసించిన ప్రదేశంగా ఈ స్థలం అన్ని మతాల వారిచే గౌరవించబడుతున్నది. ఏటా దేశ విదేశాల నుండి ప్రముఖులు, యాత్రికులు లక్షల సంఖ్యలో దర్గా ను సందర్శిస్తుంటారు.

చిత్ర కృప : Mujeerkhan

స్వర్ణ దేవాలయం

స్వర్ణ దేవాలయం

స్వర్ణ దేవాలయం, అమృత్సర్ లో కలదు. సిక్కుల పవిత్ర స్థలం గా ఖ్యాతి గాంచిన ఈ దేవాలయం యొక్క గురుద్వారా ని 400 కేజీల బంగారు పూత వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉంటే సిక్కులు ఏటా లక్షల సంఖ్యలో శ్రీ హరమందిర్ సాహిబ్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దెందుకు కేంద్రం కృషి చేస్తున్నది.

చిత్ర కృప : Prashant Ram

కామాక్షి ఆలయం

కామాక్షి ఆలయం

కామాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడు లోని కాంచీపురం లో కలదు. పల్లవ రాజుల చే నిర్మించబడ్డ ఆలయం లో అమ్మవారు యోగముద్రలో పద్మాసనం పై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లువరిస్తూ ఉంటుంది. ఆలయ శిల్ప సంపదను మరియు అమ్మవారిని దర్శించుకొనేందుకు యాత్రికులు వస్తుంటారు.

చిత్ర కృప : B Balaji

జగన్నాథ ఆలయం

జగన్నాథ ఆలయం

ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో ప్రసిద్ధి గాంచిన జగన్నాథ ఆలయం కలదు. ఏటా నిర్వహించే రథయాత్ర సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో హాజరై కృష్ణుడిని ఆరాధిస్తారు. జగన్నాథుడు నివసించే ఈ స్థలాన్ని కేంద్రం వెంటనే పరిశుభ్ర పరచాలని యోచిస్తున్నది.

చిత్ర కృప : Ajay Goyal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X