Search
  • Follow NativePlanet
Share
» »గోవా వెళితే చేయకూడని 10 అంశాలు !

గోవా వెళితే చేయకూడని 10 అంశాలు !

By Mohammad

భారతదేశంలో అమితంగా ఆకట్టుకొనే గమ్యస్థానాలలో గోవా ఒకటి. ఇక్కడి వయ్యారంగా ఉండే బీచ్ లు మరియు చవకగా లభించే ఆల్కాహాలు ప్రపంచంలోని పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇటువంటి గోవా కు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంది. దిగువన పేర్కొన్న ఈ 10 అంశాలు మీరు అక్కడికి వెళ్లిన తరువాత చేయకూడదు. అవేంటివో ఒకేసారి పరిశీలిద్దాం పదండి !

1. టాక్సీ అద్దెకు తీసుకోవటం

మీరు గోవా అనే కాదు, ఏదేని నగరానికి కొత్త అయితే .. అక్కడివారిని నమ్మకండి (మీకు తెలిసిన వారు ఉంటే తప్ప). ఆటో లేదా ఇంకేదైనా ప్రవేట్ వాహనం అంటే టాక్సీ, క్యాబ్ లాంటివి అన్నమాట .. మీటర్ వేసి మీ జేబులు ఖాళీ చేస్తాయి. అందుకని మీరు పక్కా ప్రణాళికతో ప్రీ - పెయిడ్ (ముందుగానే చెల్లింపు) వాహనాలను ఎంచుకోండి. గోవా లో ఇది తప్పనిసరి!

2. అనుమతి లేకుండా టూరిస్ట్ ల ఫోటోలు తీయవద్దు

మీరు ఆ ప్రదేశానికి కొత్త మరియు అక్కడి వారు మీకు తెలియక పోతే గమ్మున ఉండండి. లేకుంటే మీరు పట్టుబడిపోతారు (ఫొటోలు తీసేటప్పుడు). వీలైనంత వరకు అక్కడి వారిని మర్యాదగా పలకరించండి మరియు బార్ లకు దూరంగా ఉండండి.

టూరిస్ట్ ల అనుమతి లేకుండా ఫోటోలు తీయటం నేరం !

టూరిస్ట్ ల అనుమతి లేకుండా ఫోటోలు తీయటం నేరం !

చిత్ర కృప : nevil zaveri

3. అపరిచితుల వద్ద అంటే

అపరిచితులు తీక్షణంగా చూడవద్దు. అది మీకు మరియు అక్కడివారందరికి ఇబ్బంది కాగలదు. ఆడవాళ్ల పై దురుసుగా, మూర్ఖంగా ప్రవర్తించవద్దు. మీ మీద చెడు అభిప్రాయం పడుతుంది.

4. కుటీరాల వద్ద రాయల్ సౌకర్యాలు

చాలా మంది గోవా వెళితే హోటళ్లలో బస చేయాలనుకుంటారు అది తప్పని కాదు కానీ, డబ్బును ఎక్కువగా ఖర్చు చేయలేని పక్షంలో కుటీరాలు ఎంచుకోవచ్చు. ఇవి తక్కువ ధరకే లభ్యమవుతాయి. ఫైవ్ స్టార్ హోటళ్లలో లభించే సౌకర్యాలన్నీ మీకు లభిస్తాయి. ఈ కుటీరాలు మీకు సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ఇది సలహా మాత్రమే !

5. ప్రదేశంలో చెత్తా చెదారం వేయకండి

గోవా లోని బీచ్ లు అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తుంటారు. కనుక, చెత్త వేసి ఆ ప్రదేశాన్ని పాడు చేయకండి. చెత్త వేయటం ఏదో సరదా అనుకునేరు భారీ మూల్యం చెల్లించక తప్పదు

6. ఓవర్ డ్రింకింగ్

చవకగా మందు దొరుకుతుంది కదా అని ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగకండి. మీరు తాగేవారైతే, మీకిష్టమైన బ్రాండ్ ని ఎంచుకోండి. ఒకేవేళ కొత్త ప్రదేశం కదా అని కొత్త బ్రాండ్ ట్రై చేద్దామనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఓవర్ గా డ్రింక్ చేయవద్దు మరియు డ్రింక్ చేసి డ్రైవ్ చేయవద్దు.

బీచ్ వద్ద నిద్రపోవటం మంచిది కాదు

బీచ్ వద్ద నిద్రపోవటం మంచిది కాదు

చిత్ర కృప : Brunda Nagaraj

7. బీచ్ వద్ద పడుకోవడం

బీచ్ వద్ద వీచే చల్లని గాలికి, సముద్ర ప్రవాహాలకి, ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులైపోయి పొరపాటున అక్కడే రాత్రి బీచ్ ఒడ్డున నిద్రపోదాం అనుకుంటే పీతలు, ఎండ్ర కచ్చల తో మీ నిద్ర కు భంగం వాటిల్లుతుంది. కనుక, మీకు కేటాయించిన రూం లలో నిద్రపోండి.

8. ఖరీదైన ఆభరణాలను ధరించడం

మీరు గోవాకి వచ్చింది పర్యటన చేయటానికి. అంతేకాని పెళ్ళికో లేక ఏదేని ఫంక్షన్ కో కాదు. కనుక ఖరీదైన ఆభరాణాలను వీలైనంత వరకు దూరంగా ఉంచండి.

టాటూ వేయించుకొనేటప్పుడు జాగ్రత్త !

టాటూ వేయించుకొనేటప్పుడు జాగ్రత్త !

చిత్ర కృప : Brunda Nagaraj

9. శిక్షకుడు లేకుండా నీటి క్రీడలు ఆడవద్దు

గోవాలో అద్భుతమైన అడ్వెంచర్ నీటి క్రీడలు ఆడవచ్చు. అలా అని తెలియని నీటి క్రీడలను కూడా తెలుసని ఓవర్ గా రియాక్టై ఆడితే మీ ప్రాణానికే ప్రమాదం. కనుక, శిక్షకుడు లేకుండా లేదా అతని సలహా వినకుండా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఆడవద్దు.

10. సరైన టాటూ వాలా ను ఎంచుకోండి

గోవా లో టాటూ వాలా (పచ్చబొట్లు వేసేవాళ్ళు) లు అధికం. ఏ బీచ్ లవద్దనో లేక షాప్ పెట్టుకొనొ వీరు కనిపిస్తారు. ఇక్కడి టాటూ వాలా లు అందరూ ఎక్సపర్ట్ లేం కాదు. మీరు సరైన ప్రదేశాన్ని, అనుభవజ్ఞుణ్ణి ఎంచుకొని టాటూ వేయించుకోండి. తాత్కాలికంగా టాటూ వేయించుకొనేవారైతే ఏ బీచ్ వద్ద పోయినా సరిపోతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X