Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడు అంటే చాలు గుర్తుకోచ్చేస్తాయ్!

తమిళనాడు అంటే చాలు గుర్తుకోచ్చేస్తాయ్!

తమిళనాడు కు స్వాగతం. ఇక్కడ అంతా ప్రాచీన సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలూ. ఈ ప్రాంతం అంతా ద్రావిడ నాగరికత. దేవాలయ గోపురాలు, సాంప్రదాయ సంగీతాలు, డాన్సులు, కళలు ఉట్టిపడే తంజావూర్ లాంటి ప్రదేశాలు. ఇవన్నీ ఈ రాష్ట్రానికి వచ్చే, పర్యాటకులకు, యాత్రికులకు ఎంతో ఆదరంగా గోచరిస్తాయి. మరికొంతమందికి ఇక్కడ కల పొడవైన కోస్తా తీరం, అద్భుత హిల్ స్టేషన్ లు ఆకర్షనీయం. ఇవన్నీ మీకు ప్రధానంగా బయటకు కనిపించేవి. ఇవే కాక, తమిళనాడు ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ అందరను ఆనందింప చేసే మరి కొన్ని విలువైన అంశాలు కలవు. అవి ఏమిటో పరిశీలిద్దాం.

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

మదురై మీనాక్షి దేవాలయం

దక్షిణ ఇండియా లో కల మదురై మీనాక్షి దేవాలయ శిల్ప సౌందర్యం , ఉత్తరాదిన కల తాజ్ మహల్ అంతటి గొప్పది.ఈ టెంపుల్ కాంప్లెక్స్ సుమారు ఆరు హెక్టేర్ లలో విస్తరించి వుంది. పన్నెండు గోపురాలతో ఎత్తుగా, హుందాగా నిలబడి వుంటుంది.

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

అమ్బూర్ దం బిరియాని

తమిళనాడు పర్యటనలో వెల్లూరు జిల్లాలోని వెల్లూరు కు ఎపుడైనా వెళ్ళారా ? ఇక్కడ అమ్బూర్ చికెన్ బిరియాని ఎంతో ప్రసిద్ధి. అసలు బిరియాని పుట్టింది ఇక్కడే నంటారు. అమ్బూర్ ఒక చిన్న పట్టణం. బిరియానికి ప్రసిద్ధి.

Photo Courtesy: Umesh Tongbra

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

కాంచీపురం
కంచిపట్టు చీరల గురించి వినని వారుండరు. కాంచీపురం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఈ చీరాల డిజైన్ లు, రంగులు, వీటికి వాడబడిన జారి , బంగారు దారం అన్నీ కలిపి పట్టు అంటే కంచి పట్టు మాత్రమే అనేలా చేస్తాయి. Photo Courtesy: Simply CVR

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

చేట్టినాడ్ ఆహారాలు
చేట్టినాద్ ఆహారాలను కరైకూడి ఆహారాలని కూడా అంటారు. చేట్టినాద్ తమిళ్ నాడు లోని శివగంగ జిల్లాలో కలదు. ఇక్కడ మసాలాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే వివిధ వంటకాలు ప్రతి ఒక్కరికి నోరు ఊరిన్చేస్తాయి. స్థానికులు ఈ డిష్ లను ఆచి సమయాల్ అంటారు. వీరి వంటల విధానం అందరను ఆశ్చర్య చకితులను చేస్తుంది.

Photo Courtesy: Yashima

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

కన్యాకుమారి లో సూర్యోదయం

ప్రతి పర్యాటకుడు కన్యాకుమారిలో సూర్యోదయం తప్పక చూడాలి. క్షణాలలో రంగులు మారి పోతూ వుంటాయి. తమిళనాడు లోని కన్యాకుమారి దక్షిణాదిన చివరి ప్రదేశం. ఇక్కడి బీచ్ చాలా అందంగా వుంటుంది. సూర్యోదయంలో ఆకాశం వివిధ రంగులు మారటాన్ని మీరు చూస్తారు.

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

మెరీనా బీచ్ లో చిన్న షికారు
చెన్నై లోని మెరీనా బీచ్ ప్రపంచంలో రెండవ పొడవైన బీచ్ మరియు పొడవైన పట్టన బీచ్. సుమారు 13 కి. మీ. ల దూరం వుంది. అలలు ఎగిసి పడుతూ వుంటాయి. బీచ్ ఇసుక లో నడుస్తూ వుంటే...మెత్తగా మీ పాదాలు లోపలి జారి పోతూ వుంటాయి. ౭.

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

తంజావూర్ పెయింటింగ్ లు
తమిళనాడు లోని తంజావూర్ లో తంజావూర్ పెయింటింగ్ లు బొమ్మలు ప్రసిద్ధి. తమిళనాడులో ఈ నగరం ఇతర నగరాలకంటే విభిన్నంగా వుంటుంది. Photo Courtesy: Booradleyp

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

పంబన్ బ్రిడ్జి
రామేశ్వరంలో కల సుమారు రెండున్నర కి. మీ. ల పొడవుకల పంబన్ బ్రిడ్జి ఒక అద్భుతం. తప్పక చూడాలి. ఇండియా లో ఈ బ్రిడ్జి రెండవ పొడవైనది గా చెపుతారు. పంబన్ బ్రిడ్జి రామేశ్వరం ను తమిళనాడు తో కలుపుతుంది.

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

కళ్ళని డాం
త్రిచి లోని కళ్ళని డాం ప్రపంచంలోని పురాతన డాములలో ఒకటి. నేటికీ ఇది వాడుకలో కలదు. కావేరి నది పై నిర్మించిన ఈ డాం పొడవు 329 మీ. లు వెడల్పు 20 మీ. లు. గా వుంటుంది. తమిళనాడు లో ఈ డాం చాలా ప్రసిద్ధి

Photo Courtesy: Thangaraj Kumaravel

పదే పది అంశాలకు ఫేమస్

పదే పది అంశాలకు ఫేమస్

శివకాశి పటాకులు
తమిళనాడు లో చిన్న పిల్లలు సైతం శివకాశి పటాకులకు ప్రసిద్ధి అని చెపుతారు. ఇక్కడ అనేక ఫైర్ క్రాకర్ కంపెనీ లు కలవు. ఇక్కడ పటాకులు, పండుగలలో దేశం లోని అన్ని ప్రాంతాలకూ సరఫరా చేయబడతాయి. చవక ధరలలో కూడా వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X