అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

భారతదేశంలో 10 ట్విన్ టౌన్స్ మరియు సిస్టర్ సిటీస్ గురించి మీకు తెలుసా?

Written by: Venkatakarunasri
Updated: Thursday, May 11, 2017, 14:11 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

మనలో చాలామందికి భారతదేశంలో గల జంట పట్టణాలు మరియు భారతీయ రాష్ట్రాల సోదర నగరాల గురించి తెలియదు. భారతదేశంలోని ఇతర నగరాలు డామన్-డయ్యు, ఢిల్లీ-నోయిడా, కంకోరోలి-రాజాసాంద్, నైని-అలహాబాద్ మరియు రాజస్థాన్ నుండి అజ్మీర్ మరియు పుష్కర్ల జంట నగరాలు. ఇక్కడ రెండు పట్టణాలు లేదా సోదరి నగరాలుగా పరిగణించబడే భారతీయ నగరాల జాబితా ఇవ్వబడినది.

వాటిని సిస్టర్ సిటీస్ అని పిలవబడటానికి కారణాలేంటో తెలుసా? భారతదేశం వివిధ నమ్మకాలు, సంప్రదాయలు, ప్రతిష్టాత్మకమైన సంస్కృతి కలిగిన దేశం. భారతదేశంలోని ప్రజలు ఇతరదేశాలకు ఆదర్శంగా వున్నారు. భారతదేశంలో సిస్టర్ సిటీస్ ఉన్నాయి తెలుసా? ఒకటి కాదు రెండు కాదు 10 వున్నాయి. ఇప్పుడు మనం టాప్ 10 సిస్టర్ సిటీస్ గురించి తెలుసుకుందాం.

Latest: ప్రకృతి చెక్కిన శిల్పాలు - మీరు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన ప్రదేశాలు !

"విమానంలో ప్రయాణం....ఒక్క రోజులోనే ఏడుకొండల వాడి దర్శనం"!

 

భారతదేశంలోని టాప్ 10 ట్విన్ సిటీస్ !

1. గుజరాత్ లోని అహ్మదాబాద్ - గాంధీనగర్

గాంధీనగర్-అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి జంట నగరాలుగా ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి సుమారు 24 కిమీ దూరంలో ఉంది. గాంధీనగర్ ను భారతదేశం యొక్క పచ్చని నగరం అని కూడా అంటారు. అహ్మదాబాద్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి.

అహ్మదాబాద్ - ప్రసిద్ద పర్యాటక మజిలీ !

గాంధీనగర్ - గుజరాత్ రాజధాని !!

en.wikipedia.org

 

 

2. ఒడిషాలోని కటక్-భువనేశ్వర్

ఒరిస్సా యొక్క రెండు బాగా అభివృద్ధి చెందిన నగరాలు. ఇవి ఒకదానికొకటి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మరియు మహానది నదిచే విభజించబడ్డాయి.

కటక్ - ఒక చారిత్రాత్మక నగరం!

భువనేశ్వర్ - అనేక దేవాలయాలు ఉన్న ప్రదేశం !

pc: Shouvik Seal

 

 

3. ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్-సికింద్రాబాద్

హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లను కలిపి ఆంధ్రప్రదేశ్ యొక్క జంట నగరాలుగా చెప్తారు. ఇవి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరం. ఈ నగరం చార్ మినార్, గోల్కొండ కోట మరియు మక్కా మసీదు వంటి అనేక పర్యాటక ఆకర్షణలను అందిస్తుంది.

సికింద్రాబాద్, హైదరాబాద్

pc: wiki commons

4. మహారాష్ట్రలోని పూణె-పింప్రి చించ్వాడ్

పింప్రి-చిన్చ్వాడ్ బాగా అభివృద్ధి చెందిన నగరం, పూణే లోని పింప్రి మరియు చిన్చ్వాడ్ జంట నగరాలను కలిగి ఉంది. పుణే మరియు పింప్రి చిన్చ్వాడ్ లు పూణే నగర కేంద్రం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక టవున్ షిప్ గా ప్రసిద్ది చెందాయి.

Pune Tourism - Going Back In Time

pc: en.wikipedia.org

5. పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా-హౌరా

హుగ్లీ నది పశ్చిమ ఒడ్డున ఉన్న హౌరా కోలకతాకు జంట నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ రెండు జంట నగరాలు నాలుగు నదీ వంతెనలతో అనుసంధానించబడి ఉన్నాయి మరియు హౌరా వంతెన వాటిలో అత్యంత ప్రసిద్ధ మరియు పురాతనమైనది.

కోలకతా - సంస్కృతులకు ఒక కూడలి!

హౌరా - ఇమిడిపోయే వారసత్వ రూపకల్పన !

pc: en.wikipedia.org

6.కేరళలోని కొచ్చి-ఎర్నాకుళం

కేరళలోని ఎర్నాకులం జిల్లాలో కొచీ లేదా కొచ్చిన్ భారతదేశం యొక్క ప్రధాన ఓడరేవు. కొచ్చి-ఎర్నాకులం జంట నగరాల ప్రధాన భూభాగం భారతదేశంలో ఆరవ ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఉంది.

కొచ్చి: ప్రాచీనత మరియు నూతనత్వంల మేలు కలయిక

pc:Basavaraj Hombli

7. కర్నాటకలోని హుబ్లీ-ధార్వాడ్

హుబ్లీ మరియు ధార్వాడ్ కర్ణాటకలోని జంట నగరాలు. ఇవి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. హుబ్లీ నగరం కర్నాటక రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూడవలసిన ప్రధాన ఆకర్షణలు చంద్రమౌళీశ్వర ఆలయం, ఉన్కాల్ సరస్సు మరియు నృపతుంగా హిల్.

హుబ్లీ - దక్షిణాది చివరి జంటనగరాలు

8. ఛత్తీస్ ఘఢ్ లోని దుర్గ్-భిలాయ్

భిలాయ్ ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ జిల్లాలో ఉంది. దుర్గ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భిలాయ్ ఉక్కు కర్మాగారానికి ప్రసిద్ధిచెందినది. దుర్గ్ మరియు బిలాయి జంట నగరాలు ఛత్తీస్ ఘఢ్ యొక్క పారిశ్రామిక మరియు విద్యా కేంద్రంగా ఉన్నాయి.

దుర్గ్ - తీర్దయత్ర నగరం !

భిలాయ్ - ఉక్కు నగరం !

pc: en.wikipedia.org

9. జార్ఖండ్ లోని రాంచీ-హటియా

రాంచి ఝార్ఖండ్ రాజధాని నగరం మరియు హటియా జిల్లాలో ఒక చిన్న పట్టణం మరియు రైల్వే స్టేషన్. ఈ పట్టణం మరియు నగరంను బంధువు సోదరి నగరాలు లేదా పట్టణంగా సూచించవచ్చు.

pc: ranchi.nic.in

 

10. తమిళనాడు తిరునెల్వేలి-పాలయంకోట్టై

తమిళనాడులో పాలియంకోటై మరియు తిరునెల్వేలి యొక్క అందమైన జంట నగరాలు ఉన్నాయి. పాలయంకొట్టై తిరునల్వేలి జిల్లాలో ఉన్న ఒక పట్టణం మరియు ప్రభుత్వ మ్యూజియం, సైన్స్ సెంటర్ మరియు జియోమాగ్నెటిక్ రిసెర్చ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందింది.

తిరునల్వేలి - పాత కొత్తను కలిసే చోటు!

pc:Vashikaran Rajendrasingh

Read more about: ఇండియా, india
English summary

10 Twin Towns And Sister Cities Of Indian States In Telugu

Here is the list of Indian cities which can be considered as twin towns or sister cities.
Please Wait while comments are loading...