Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో అంతగా ఎవ్వరికీ తెలియని సినిమా షూటింగ్ లకు అనువైన 10 కోటలు !

భారతదేశంలో అంతగా ఎవ్వరికీ తెలియని సినిమా షూటింగ్ లకు అనువైన 10 కోటలు !

హాలీవుడ్ లోనే కాకుండా భారతదేశంలో కూడా సినిమాల షూటింగ్ చేయటానికి అద్భుతమైన నిర్మాణాలు వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్మాణాలు వారసత్వంగా వున్నాయి.

By Venkata Karunasri Nalluru

హాలీవుడ్ లోనే కాకుండా భారతదేశంలో కూడా సినిమాల షూటింగ్ చేయటానికి అద్భుతమైన నిర్మాణాలు వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్మాణాలు వారసత్వంగా వున్నాయి. రాజస్థాన్ లోని అంబర్ కోట, గోవాలో చపోర ఫోర్ట్ వంటి ప్రముఖమైన ప్రదేశాలలో కొన్ని తక్కువగా తెలిసిన ప్రదేశాల్లో కూడా పెద్ద తెరపై చూపటానికి తగినంత సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఎల్లప్పుడూ భారతదేశంలోని అద్భుతమైన ప్రదేశాలు కోటలను ఉపయోగిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే కొన్ని ప్రముఖ హాలీవుడ్ సినిమాలు కూడా భారతదేశంలో తీశారు !

ఇప్పటికే భారతదేశంలో చారిత్రాత్మక చలనచిత్ర షూటింగ్ స్థానాలైనటువంటి రాజస్థాన్ కోటలు, డార్జిలింగ్, అత్తిరాపల్లి ఫాల్స్, ఉదయపూర్ ప్యాలెస్ లు తదితరాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ అందమైన కోటలను చూస్తే మీరూ మాతో అంగీకరిస్తారు. ఈ ప్రదేశాలు ప్రసిద్ధమైనవి కాకపోవచ్చు కానీ వారు ఇప్పటికీ తెరపై సూపర్బ్ గా చూడవచ్చు.

ఇక్కడ వుండే ఫోటో టూర్ మీకోసం !

గమనిక : ఇది కేవలం షూటింగ్ ప్రదేశాల గురించి చెప్పటానికి కానీ మన భారతదేశ చరిత్ర సంస్కృతి శిథిలావస్థలో వున్న కోటల గురించి వర్ణించటం కాదు.

1. మండు కోట

1. మండు కోట

మండు కోట కాంప్లెక్స్ మధ్యప్రదేశ్ లో వుంది. నిజంగా అద్భుతంగా వుంటుంది. ఈ కోట యొక్క అద్భుతమైన ఆకృటి తెరపై చాలా బాగా కనపడుతుంది. మండు పట్టణం చాలా వరకు చరిత్ర ప్రసిద్ధ ప్రకృతి ప్రదేశాలు కలిగి వుంటుంది. టవున్ యొక్క గోడలు అద్భుత శిల్ప శైలి కలిగి వుంటాయి. ఎన్నో మసీదులు, మహళ్ళు అన్నీ కూడా గత చరిత్రను పునరుద్ధరిస్తాయి. ఇక్కడ చూడవలసిన వాటిలో రూపమతి మహల్, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటులు, తాజ్ మహల్ వలే మార్బుల్ తో నిండిన హోశాంగ్ టూమ్బ్ మొదలైనవి. చరిత్ర లోకి వెళితే, ఇపుడు కనపడే ప్రతి ప్రదేశాన్ని చూసి ఆనాటి పాలకుల కళాత్మక దృష్టి ని అభినన్దించవచ్చు. ఒకప్పుడు మండు ఆఫ్ఘన్ పాలకుడైన దిలావార్ ఖాన్ పాలించిన చిన్న రాజ్యం. దిల్వార్ ఖాన్ కుమారుడైన హోశాంగ్ షా దీనిని బాగా అభివృద్ధి చెసాడు. అయితే అక్బర్ దీని రాజు బాజ్ బహాదోర్ ను ఓడించి తన మొగల్ రాజ్యం లో మరో మారు మరాఠాలు 1732 లో దీనిని జయైన్చేతంత వరకూ వుంచుకున్నాడు. మండు , మాండవ్ ఘర్ లేదా శాదియాబాద్, అంటే ఒక ఆనందాల భూమి. కాలంతో బాటు ప్రకృతి తెచ్చే అనేక పెను ముప్పులకు ఈ పట్టణం ఎంతో నష్ట పోయింది. అయినప్పటికీ మండు టూరిజం విహారాన్ని అందిస్తోంది. సాంప్రదాయక మాల్వా ఆహారాలు దాల్ బాత్ మరియు టూరిజం శాఖ నిర్వహించే మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలసి, పర్యాటకులకు ఒక చక్కని సెలవుల విహార యాత్రని అందిస్తోంది.

PC: Intekhab0731

2. రైసేన్

2. రైసేన్

రాయ్సేన్ కోట చూచుటకు చాలా మనోహరంగా వుంటుంది. మధ్యప్రదేశ్లో రాయ్సేన్ పట్టణంలో ఉన్న కోట చిత్రం షూటింగ్ లొకేషన్ కి చాలా బాగుంటుంది.

PC: Vijay Tiwari09

3. గావిల్ఘార్ - గావిల్ఘర్ కోట

3. గావిల్ఘార్ - గావిల్ఘర్ కోట

గావిల్ఘార్ - గావిల్ఘర్ కోట మహారాష్ట్రలో తక్కువగా తెలిసిన కోటలలో ఒకటి. ఈ పర్వత కోట చాలా కాలం మరాఠాలు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిధిలో ఉండేది. నేడు ఇది ఒక శిధిలమైన స్థితిలో ఉంది కానీ ఈ కోట ముఖ్యంగా వర్షాకాలంలో చాలా అందంగా కనిపిస్తుంది.

PC: C. Shelare

4. కోరిగడ్

4. కోరిగడ్

కోరిగడ్ మహారాష్ట్రలో వున్న అతి పురాతన కోటలలో ఒకటి. ఇది శివాజీ పాలనలో బంధింపబడివున్న ఒక పర్వత కోట. కోరిగడ్ లోనావాలా సమీపంలో కొన్ని అద్భుతమైన దృశ్యాలు వున్నాయి. అయితే ఈ కోట శిథిలావస్థలో ఉంది.

PC: Amogh Sarpotdar

5. తారాఘర్ కోట

5. తారాఘర్ కోట

రాజస్థాన్ భారతదేశంలోని టాప్ చిత్రాల షూటింగ్ స్థానాలలో ఒకటి. ఈ కోట సినిమాలలో ఒక అందమైన రాజభవనంగా వుంది. తారాఘర్ కోట ప్రసిద్ది కాకపోవచ్చు కానీ ఈ కోట రాజస్థాన్ లో ఆఫ్ బీట్ కోటలలో ఒకటి.

PC: Diman-ozzy

6. గింగీ కోట

6. గింగీ కోట

గింగీ కోట నిర్మాణం చాలా స్ట్రాంగ్ గా వుంది. అందువల్ల బ్రిటిష్ వారు 'ట్రాయ్ ఆఫ్ ది ఈస్ట్' అని పిలిచేవారు. నేడు గింగీ కోట తమిళనాడులో ప్రసిద్ధ కోటలలో ఒకటి. ఇది విల్లుపురంలో వుంది.

PC: Karthik Easvur

7.ఆంధ్రప్రదేశ్ లోని కొండపల్లి కోట

7.ఆంధ్రప్రదేశ్ లోని కొండపల్లి కోట

కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో విన్న విజయవాడ సమీపంలో ఉన్న 14 వ శతాబ్దపు నిర్మాణం. ఈ అందమైన పర్వత కోట తూర్పు కనుమలలోని ఒక ఆకర్షనీయమైన సెట్. కొండపల్లి కోటా వద్ద సంభ్రమాన్నికలిగించే చిత్రం షూటింగ్ ఖచ్చితంగా చేయవచ్చు.

PC: Vin09

8.కలింజర్ కోట

8.కలింజర్ కోట

కలిన్జర్ కోట ఉత్తర ప్రదేశ్ లోని గత రాజవైభావాన్ని వర్ణిస్తుంది. కలిన్జర్ ఫోర్ట్ ఒక ప్రత్యేక నిర్మాణం. అందువలన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక చిత్రం చిత్రీకరణ చేయగల్గిన ప్రదేశాలలో సేవచేసే భారతదేశంలో కనిపెట్టబడని కోటలలో ఒకటి.

PC: Sagar Das, Rosehub

9. రీస్ మార్గోస్ కోట

9. రీస్ మార్గోస్ కోట

ఇటీవలి దశాబ్దాలలో గోవా అత్యంతగా భారతదేశంలో బాలీవుడ్ చిత్రం షూటింగ్ స్థానాలకి లాభసాటిగా మారింది. ఇక్కడి బీచ్లు మరియు కోటలు కొన్ని చిత్రాలలో చూపబడిన తర్వాత ఆదరణ పొందాయి. మండోవి నది ఉత్తర ఒడ్డున రీస్ మార్గోస్ కోట అలాంటి ఆఫ్బీట్ ప్రదేశంగా చెప్పబడుతుంది.

PC: Ashwin Kumar

10. మంజరాబాద్ కోట

10. మంజరాబాద్ కోట

మంజరాబాద్ కోట కర్నాటకలో గల సకలేశ్ పురలో వున్న టాప్ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ రక్షణ కోట పశ్చిమ కనుమలు చుట్టూ అందంగా నక్షత్రం ఆకారంలో ఉంది. ఇది ఫోటో షూట్ లేదా ఒక చిత్రాల షూటింగ్ కోసం ఒక అద్భుతమైన ప్రదేశం.

PC:Chandu6119

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X