Search
  • Follow NativePlanet
Share
» »1000 ఏళ్ళ ఆలయాల అంతుచిక్కని రహస్యాలు

1000 ఏళ్ళ ఆలయాల అంతుచిక్కని రహస్యాలు

మన దేశంలో హిందూ మతం నాటి నుండి నేటి వరకు ఉచ్చ స్థాయి లో ఉన్నదంటే దానికి కారణం దేవాలయాలు. ఈ దేవాలయాలు నాటి పురాతన సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనాలు.

By Venkatakarunasri

మన దేశంలో హిందూ మతం నాటి నుండి నేటి వరకు ఉచ్చ స్థాయి లో ఉన్నదంటే దానికి కారణం దేవాలయాలు. ఈ దేవాలయాలు నాటి పురాతన సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనాలు. చారిత్రకంగా కూడా దేవాలయాలు ప్రాముఖ్యతను కలిగిఉన్నాయి. క్రీ.శ. 1 వ శతాబ్దం నుండి నిర్మించిన కట్టడాలు అనేకం మన భారతదేశంలో కనిపిస్తాయి. వీటివలన హిందూ యుగపు చరిత్రపై అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి.

భారతదేశంలో వెయ్యి సంవత్సరాల పైబడి ఆలయాలు చాలానే ఉన్నాయి. ఇవి ఇంతకూడా కదలకుండా, మెదలకుండా, వన్నె తగ్గకుండా ప్రకృతివైపరీత్యాలకు తట్టుకొని ఇంకా యాత్రికులను ఆకర్షిస్తున్నాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు. వీటిని చూస్తే అప్పట్లోనే అంతటి అద్భుత కట్టడాలు ఎలా కట్టరబ్బా ?? అని అనిపిస్తుంది. ఇప్పుడున్నాయి ఎందుకు ?? ... అలా కడుతుంటే ... ఇలా కూలిపోతుంటాయి. ప్రస్తుత వ్యాసం భారతదేశంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పైబడి ఆలయాల గురించి. ఇక్కడ పేర్కొన్నవి వాటిలో కొన్ని మాత్రమే. మరి వాటిని చూసొద్దాం పదండి

మన దేశంలో 1000సంవత్సరాలుగా వున్న ఆలయాలు వాటి మిస్టరీ వెనుక దాగివున్న రహస్యాలు ఏంటో చూద్దాం.

కైలాసదేవాలయం

కైలాసదేవాలయం

మహారాష్ట్రలోని ఎల్లోరాలోని కైలాసదేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం.

కైలాసదేవాలయం

కైలాసదేవాలయం

క్రీ.శ.8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 150ఏళ్ళు పట్టిందట.

ఈ ఆలయం ప్రత్యేకత

ఈ ఆలయం ప్రత్యేకత

ఈ ఆలయ ప్రత్యేకత విషయానికివస్తే ఆలయఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి అప్పుడు వేసిన రంగు ఇప్పటికీ వుండటం విశేషం.

ఈ ఆలయం ప్రత్యేకత

ఈ ఆలయం ప్రత్యేకత

ఈ ఆలయమంతటా రామాయణభాగవత గాధలను శిల్పాలుగా చెక్కారు.

బదరీనాథ్ క్షేత్రం

బదరీనాథ్ క్షేత్రం

ఉత్తరాఖండ్ లోని బదరీనాథ్ క్షేత్రం గురించి మీరు వినే వుంటారు. ఇక్కడ విష్ణుమూర్తి కొలువైవున్నారు.

బదరీనాథ్ క్షేత్రం

బదరీనాథ్ క్షేత్రం

భూలోక వైకుంఠంగా పిలవబడుతున్న ఈ ఆలయం హిమాలయాల్లో 10,000అడుగుల ఎత్తున వుంది.

బదరీనాథ్ క్షేత్రం

బదరీనాథ్ క్షేత్రం

ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేయవలసిన అవసరం లేదని అంటారు. ప్రతి ఒక్కరూ సందర్శించుకొనవలసిన ఆలయమని చెప్తారు.

కుంభకేశ్వర ఆలయం

కుంభకేశ్వర ఆలయం

కుండలను తయారుచేయవలసిన మట్టితో శివలింగాన్ని ప్రతిష్టించిన ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో కుంభకేశ్వర ఆలయంలో కలదు.

కుంభకేశ్వర ఆలయం

కుంభకేశ్వర ఆలయం

9వ శతాబ్దంలో చోళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు.

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

బీహార్ లోని అతి పురాతన ఆలయాలలో కైమూర్ జిల్లాలోని ముండేశ్వర్ పుణ్యక్షేత్రం ప్రసిద్ధిచెందింది.

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

19ఏళ్ల చరిత్రకలిగిన ఈ ఆలయం 608అడుగుల ఎత్తు గల కొండపై వుంది.

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

ఈ ఆలయాన్ని క్రీ.శ.108వ సంవత్సరంలో నిర్మించారని చెబుతున్నారు.

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

గుప్తుల కాలం నుండే ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి.

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

ముండేశ్వర్ పుణ్యక్షేత్రం

ఈ ఆలయంలో నాలుగు ముఖాలు గల శివుని విగ్రహం మరియు పార్వతి అమ్మవారు వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X